Last Updated:

Vijayasai Reddy : శత్రువుకి కూడా నీలాంటి కూతురు పుట్టకూడదంటూ పురంధేశ్వరిపై ఫైర్ అయిన విజయసాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతుంది అనిపిస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

Vijayasai Reddy : శత్రువుకి కూడా నీలాంటి కూతురు పుట్టకూడదంటూ పురంధేశ్వరిపై ఫైర్ అయిన విజయసాయిరెడ్డి

Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతుంది అనిపిస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా విజయ సాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా వరుస పోస్ట్ లతో పురంధేశ్వరి పై నెక్స్ట్ లెవెల్ లో మండిపడడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

ఎన్టీఆర్ ఇంటికి పదడుగుల దూరంలో ఉండి కూడా ఆయనకు ఒక్క ముద్ద కూడా పెట్టలేదు కదా చెల్లెమ్మా పురందేశ్వరి! ఆ వయస్సులో ఆయన అనారోగ్యంతో బాధపడుతూ కూడా కష్టపడి సాధించుకున్న అధికారాన్ని 8 నెలలు కూడా తిరక్కుండానే మీరు, మీ భర్త, మీ బావ గారితో చేతులు కలిపి…పాపం! 73 ఏళ్ల వయస్సులో ఆపెద్దాయనను నిర్దాక్షిణ్యంగా కిందికి లాగిపడేశారే. ఏం కూతురివమ్మా నీవు? శత్రువుకి కూడా ఇలాంటి కూతుళ్ళు పుట్టాలని ఎవరూ కోరుకోరమ్మా !’ అంటూ ఫైర్ అయ్యారు.

 

అలానే మరో పోస్ట్ లో “పురందేశ్వరి.. కులం, కుటుంబం చుట్టే మీ రాజకీయాలు.. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు.. మీ ప్రతి కదలిక, ఆలోచన అంతా స్వార్ధ ప్రయోజనాలే.. మీ అంతిమ లక్ష్యం కుల ఉద్దారణే.. మీకు సిద్దాంతం, విధానం, ప్రవర్తన, వ్యక్తిత్వం, సమాజహితం, మంచి, స్నేహం, ధర్మం, న్యాయం ఏమీ లేవు.. స్వార్థం తప్ప.. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం అంటూ విజయసాయి రెడ్డి రాసుకొచ్చారు. స్వార్థం, కపటం పురంధేశ్వరి సహజ అభరణాలు. టీడీపీతో పొత్తులేకున్నా సొంత పార్టీని గాలికొదిలేసి దానిని తలకెత్తుకున్నారు. బంధుత్వం మాటున ఆమె రహస్య ఎజెండా ఏమిటంటే బావ చంద్రబాబు గారి సహాయంతో ఎంపీగా గెలిచి బిజెపి ప్రభుత్వంలో కేంద్ర మంత్రి కావాలనుకుంటున్నారు. అందుకే ఆయనపై ఈగ కూడా వాలకుండా విసనకర్ర ఊపుతున్నారు.

 

డబ్బు వ్యామోహమే తప్ప 8 ఏళ్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి.. దేశానికి, ఈ రాష్ట్రానికి చేసిందేమీ లేదు. మానవ వనరుల శాఖ, వాణిజ్య శాఖల సహాయ మంత్రిగా ప్రజలకు పనికొచ్చే ఏ చిన్న పని కూడా చేయలేదు. ఫలానా స్కీం తెచ్చారు. ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయించారు అని చెప్పుకోలేని పరిస్థితి. దృష్టంతా పైరవీలు, సంపాదనపైనే పెట్టారు.

 

 

చూడు చిన్నమ్మా…పున్నమ్మా…పురందేశ్వరి! మీ పాదస్పర్శతో కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పోయింది. రాజకీయ, నైతిక విలువలంటూ ఏమి లేని మీరు కాంగ్రెస్ పార్టీని వదిలేసి…అంతే నిస్సిగ్గుగా బీజేపీలో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఛత్తీస్ ఘడ్, ఒడిశా రాష్ట్రాల ఇంచార్జ్ గా అట్టర్ ఫ్లాప్ కావడంతో అక్కడా మిమ్మల్ని తీసేసారు. దీంతో కష్టపడి పిత్రార్జితంగా మీకు వాటా వున్న టీడీపీనైనా బతికించుకుందామని చంద్రబాబు కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తే…మీ ఎఫెక్ట్ తో చంద్రబాబు కూడా జైలుకు వెళ్ళడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పాపం! రెచ్చగొడుతున్న కొందరు కులపెద్దల చేతిలో ఇరుక్కుని మీరు వ్యక్తం చేస్తున్న ఫ్రస్ట్రేషన్ కు కాలమే సమాధానం.