Published On:

Telugu States Weather Update: బిగ్ అలర్ట్.. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు!

Telugu States Weather Update: బిగ్ అలర్ట్.. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు!

Next 3 Days Heavy Rains to AP and Telangana: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్. ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడతాయని చెప్పింది. కర్ణాటక నుంచి మరఠ్వాడ మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండడంతో ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తాలో ఇవాళ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది.

 

దక్షిణ బంగ్లాదేశ్, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతoపై ద్రోణి కొనసాగుతుంది. అలాగే ఉత్తర కోస్తా తీరంలో, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, గంటకు ౩౦ నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

 

అలాగే బంగాళాఖాతంలో ఏర్పడే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలో భారీ వర్షసూచన ఉంది. జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట, హైదరాబాద్, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, నల్లగొండ, వరంగల్ మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

 

ఇవి కూడా చదవండి: