Published On:

Jammu Kashmir Rain : జమ్మూ కశ్మీర్‌లో వర్ష బీభత్సం.. విరిగిపడ్డ కొండచరియలు.. ముగ్గురు మృతి

Jammu Kashmir Rain : జమ్మూ కశ్మీర్‌లో వర్ష బీభత్సం.. విరిగిపడ్డ కొండచరియలు.. ముగ్గురు మృతి

Jammu Kashmir Rain : జమ్మూ కశ్మీర్‌లో రెండు రోజులుగా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరపిలేకుండా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో వరద పోటెతింది. వరదల్లో చిక్కుకుని ముగ్గురు మృతిచెందారు. రాంబన్‌ జిల్లాలో 40 ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరదల్లో చిక్కుకున్న 100 మందిని సహాయక బృందాలు రక్షించాయి.

 

నిలిచిపోయిన విద్యుత్ సరఫరా..
వరదల వల్ల చాలాచోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోంది. కొండ చరియలు విరిగి పడగా, ప్రధాన మార్గాల్లో పెద్ద సంఖ్యంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. శిథిలాల కింద పలు వాహనాలు చిక్కుకున్నట్లు సమాచారం. పశ్చిమాసియాలోని ప్రత్యేకమైన వాతవరణ పరిస్థితుల వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

 

ఎప్పడూ లేనంతగా..
గడిచిన ఐదేళ్లలో జమ్మూ కశ్మీర్‌లో భారీస్థాయిలో వర్షాలు కురువడం ఇదే మొదటి సారి అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. జమ్మూ కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా స్పందించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. అత్యవసర అయితే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దని సూచించారు. రాంబన్‌లో కొండ చరియలు విరిగిపడడం వల్ల తీవ్ర ఆస్తి నష్టం సంభవించిందని ప్రకటించారు. విపత్తు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

 

 

ఇవి కూడా చదవండి: