Telugu Desam Party : సత్యమేవ జయతే అంటూ దీక్ష చేపట్టిన చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి..
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు.. అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా ఆయన అరెస్ట్ కు నిరసనగా తెలుగుదేశం పార్టీ నేడు గాంధీ జయంతి సందర్భంగా ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. సత్యమేవ జయతే పేరుతో ఈ దీక్షలను నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం అయిన
Telugu Desam Party : ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు.. అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా ఆయన అరెస్ట్ కు నిరసనగా తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేడు గాంధీ జయంతి సందర్భంగా ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. సత్యమేవ జయతే పేరుతో ఈ దీక్షలను నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం అయిన ఈ దీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా రాజమండ్రి జైలులో చంద్రబాబు, నారా లోకేశ్ ఢిల్లీలో నిరాహార దీక్షను మొదలుపెట్టారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ నివాసంలో లోకేశ్ దీక్షకు మద్దతు తెలిపేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలి వచ్చారు. దీక్షలో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.
టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ని నిరసిస్తూ ఢిల్లీ లో సత్యమేవ జయతే దీక్ష చేపట్టిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టిడిపి ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర, కేశినేని నాని, టిడిపి నేత కంభంపాటి రామ్మోహన్ రావు, ఇతర ముఖ్యనేతలు.… pic.twitter.com/MO2Yop5Bzh
— Telugu Desam Party (@JaiTDP) October 2, 2023
అలానే రాజమండ్రిలోనే ఉన్న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి దీక్ష చేపట్టారు. నిరహార దీక్షకు వెళ్లే ముందు మహాత్మ గాంధీ, లాల్ బహూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆ మహనీయులకు నివాళి అర్పించారు. మంగళగిరిలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. వీరి దీక్షలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు దీక్షలు చేపడుతున్నారు. తెలుగు జాతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానటుడు ఎన్టీఆర్ జ్ఞాపకాలతో ఈరోజు నా హృదయం నిండిపోయింది. సత్యం ఎంత కఠినంగా ఉన్నా ఎల్లప్పుడూ దానికి కట్టుబడి ఉండాలని ఆయన మనకు బోధించాడు. న్యాయం కోసం ఆయన బలమైన మద్దతు, తెలుగు ప్రజలకు సేవ చేయడంలో ఆయన అంకితభావం ఆయన పిల్లలైన మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంది’’ అని భువనేశ్వరి సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు.
సత్యమేవ జయతే దీక్షకు ముందు రాజమహేంద్రవరంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నారా భువనేశ్వరి గారు.#SatyamevaJayateDeeksha#GandhiJayanti#CBNLifeUnderThreat#TDPJSPTogether#APvsJagan#IAmWithBabu#PeopleWithNaidu#FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang pic.twitter.com/ixVg2CRb23
— Telugu Desam Party (@JaiTDP) October 2, 2023
మరోవైపు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో నిర్వహించిన సత్యమేవ జయతే దీక్షలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరతో పాటు పలువురు నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.