Published On:

Perni Nani : బాబువి డైవర్షన్‌ పాలిటిక్స్‌ : మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

Perni Nani : బాబువి డైవర్షన్‌ పాలిటిక్స్‌ : మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

Perni Nani : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడివి డైవర్షన్ పాలిటిక్స్ అని మాజీ మంత్రి, వైసీసీ నేత పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ చేయడానికి తప్పుడు విచారణలు చేయిస్తున్నారని ఆరోపించారు. సుగాలి ప్రీతి హత్య కేసు గురించి మాట్లాడారని, కానీ వాచ్‌మెన్ రంగన్న మృతిపై రాజకీయాలు సిగ్గుచేటన్నారు. వైఎస్ జగన్ డ్రైవర్ నారాయణ యాదవ్ ఆ కేసులో సాక్షి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేబినెట్‌లో ప్రజలకు చేయాల్సిన సంక్షేమం, అభివృద్ధి గురించి చర్చించలేదన్నారు. కానీ ఇతర అంశాలపై చర్చించారంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలను మోసం చేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుడు హామీల నుంచి బయట పడటానికి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. హామీలకు పంగనామాలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవినాష్‌కు ఇరికించే ప్రయత్నం..
ఎంపీ వైఎస్ అవినాష్‌కు సంబంధం లేకపోయినా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. న్యాయ వ్యవస్థను ప్రభావితం చేసేలా వార్తలు రాయిస్తున్నారని, నారాయణకు వైఎస్‌ వివేకానందారెడ్డి కేసుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బ్రెయిన్ ట్యూమర్‌తో నారాయణ చనిపోయారని, కల్లూరి గంగాధరరెడ్డిని 243వ సాక్షిగా ఉన్నారన్నారు. షుగర్ వ్యాధితో మృతి చెందారని, అతడిది సహజ మరణమని పోస్టుమార్టం రిపోర్టు నివేదికలో తేలిందన్నారు. శ్రీనివాసరెడ్డి 2018 సెప్టెంబర్‌లో ఆత్మహత్య చేసుకున్నారని, పోలీసుల వేధింపుల కారణంగా సూసైడ్ చేసుకున్నట్లు నోట్ రాశారని గుర్తుచేశారు. మరోవైపు వైఎస్ అభిషేక్‌రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారని, వైఎస్ జగన్, సునీతమ్మ ఇద్దరికీ బంధువేనని స్పష్టం చేశారు.

రంగన్న మృతిపై రాజకీయాలా?
వాచ్‌మెన్ రంగన్న మృతదేహానికి పోస్టుమార్టం చేసిన అంత్యక్రియలు చేశారని, కానీ రంగన్న గురించి కేబినెట్‌లో చర్చించారన్నారు. డీజీపీతోపాటు కడప నుంచి పోలీసులు వచ్చి ప్రభుత్వ పెద్దల సందేశం తీసుకుని వెళ్లారని, రంగన్నకు 2+2 గన్‌మెన్‌లతో వైఎస్ జగన్ ప్రభుత్వం భద్రత కల్పించిందన్నారు. చంద్రబాబు వచ్చిన తర్వాత 1+1 భద్రతకు తగ్గించారని ఆరోపించారు.. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన గన్‌మెన్ ఉండగా ఎలా అనుమానాస్పదంగా రంగన్న మృతి చెందారు? అని ప్రశ్నించారు.

ఎవరిని ఇరికించడానికి విచారణ?
ఖననం చేసిన రంగన్న మృతదేహాన్ని మళ్లీ బయటకు తీసి రీ పోస్టుమార్టం చేశారని, పరిటాల రవి హత్యలో సాక్షుల మృతిపై సీఎం చంద్రబాబు ఎందుకు విచారణ జరపలేదని నిలదీశారు. ఎవరిని ఇరికించడానికి విచారణ పేరుతో వ్యవస్థలను నాశనం చేస్తారని నిలదీశారు. ఎన్నికల హామీలను డైవర్షన్ చేయడానికి తప్పుడు విచారణలు చేయిస్తున్నారని ఆరోపించారు. రంగన్న ఇచ్చిన 164 స్టేట్‌మెంటులో అవినాష్ రెడ్డి పేరు లేదని, ఏ సాక్షి కూడా అవినాష్ పేరు చెప్పలేదని తెలిపారు.

ఇవి కూడా చదవండి: