Pawan Kalyan Varahi Yatra Day 2 : నేడు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. నిన్న కత్తిపూడిలో జరిగిన బహిరంగ సభకు భారీ ఎత్తున జనసైనికులు తరలివచ్చిన విషయం తెలిసిందే. ఈ వేదికగా పవన్ ఏపీ సర్కారుపై, సీఎం జగన్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు నేడు కూడా వారాహి యాత్ర కొనసాగనుంది. కాగా నేడు పర్యటన వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
Pawan Kalyan Varahi Yatra Day 2 : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. నిన్న కత్తిపూడిలో జరిగిన బహిరంగ సభకు భారీ ఎత్తున జనసైనికులు తరలివచ్చిన విషయం తెలిసిందే. ఈ వేదికగా పవన్ ఏపీ సర్కారుపై, సీఎం జగన్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు నేడు కూడా పిఠాపురం నియోజకవర్గంలో వారాహి యాత్ర కొనసాగనుంది. కాగా నేడు పర్యటన వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
పవన్ రెండో రోజు పర్యట వివరాలు Pawan Kalyan Varahi Yatra Day 2..
ఉదయం -11 గం.కి – జనవాణి – సత్యకృష్ణ ఫంక్షన్ హాల్, గొల్లప్రోలు
12 గం.కి – జనసేన వీర మహిళ విభాగం ప్రతినిధులతో సమావేశం – సత్యకృష్ణ ఫంక్షన్ హాల్, గొల్లప్రోలు
4 గం.కి చేబ్రోలులో నేత కార్మికులతో భేటీ కానున్నారు.
ఇక నిన్న కత్తిపూడి బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. ఈ ముఖ్యమంత్రి ఆ నాడు ప్రతిపక్షంలో ఉండి అమరావతికి మరో ఐదువేల ఎకరాలు కావాలని చెప్పి ఇపుడు మూడు రాజధానులని నాటకాలు ఆడుతున్నాడంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
అమరావతి రైతుల చావులకు కారణం వైసీపీ..
అమరావతిలో సుమారు 200 మందికి పైగా రైతులు ఆవేదనతో గుండెపోటుతో చనిపోయారు. ఆ చావులకు కారకులు వైసీపీ నాయకులు. వారు పొలాలు ఇచ్చి, ఈ రోజు ఎక్కడకు పోవాలో తెలియని పరిస్దితిలో ఉన్నారు. ఆరోజు ఐదువేల ఎకరాలు కావాలన్న వ్యక్తి ఇపుడు ఒక కులానికి చెందినదని అంటున్నారు. రాజధాని అనేది అభివృద్ది చెందే ప్రాంతం. ఇది నేను హైదరాబాద్ లో మాదాపూర్ విషయంలో చూసాను. ఈ ముఖ్యమంత్రి ప్రతిపక్షనాయకుడిగా ఉన్నపుడు ఒకలా ఇపుడు మరొకలా మాట్లాడుతున్నారు. అది తప్పు. ఆ రోజే అది ఒక కులానికి చెందినదని ఎందుకు చెప్పలేదు? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
నీ దగ్గర గూండాలు ఉంటే. నా దగ్గర విప్లవకారులు..
సంపూర్ణ మద్యపాన నిషేధం ఎక్కడా సక్సెస్ అవలేదు. అమెరికాలో కూడా విఫలమయింది. మద్యపాన నిషేధం, కరెంటు చార్జీలు, సీపీఎస్ గురించి గట్టిగా గొంతెత్తి మాట్లాడారు. కానీ ఒక్క మద్యం నుంచే పాతికవేల కోట్లు సంపాదించారు. ఓట్లేసిన వారికి కోపం రాకపోతే ఎలా? ఆడపడుచులకు కోపం రాకపోతే ఎలా? అని పవన్ అడిగారు. కనీసం గాజువాక నుంచి నన్ను గెలిపించి ఉంటే రుషికొండను ఆపేవాడిని. పవన్ కళ్యాణ్ ఈ నేలను విడిచి వెళ్లలేడు. ఓటును అమ్మేసుకుంటే అడిగే నైతిక హక్కును కోల్పోతున్నాము. భారత దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో నేను ఒకడిని. నాకు మాటలు పడటం అవసరం లేదు. ఒక్క పిలుపు ఇస్తు ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో దేశం అంతా తెలియజేసారు. ప్రభుత్వం ఆంక్షలు పెట్టవచ్చా? ప్రజలు మాత్రమే జవాబు దారీ తనమా? మేము చేగువేరాను ఆదర్శంగా తీసుకున్నాము. నీదగ్గర గూండాలు ఉంటే మా దగ్గర విప్లవకారులు ఉన్నారని పవన్ కళ్యాణ్ వైసీపీని హెచ్చరించారు.