Home / ఆంధ్రప్రదేశ్
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 22 వ తేదీన ఆయన నరసాపురానికి చెందిన పుష్పవల్లిని పెళ్లాడబోతున్నారు. రాధాకృష్ణకు సెప్టెంబర్ 3న నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి శ్రీమతి అమ్మాణి ల కుమార్తె పుష్పవల్లితో నిశ్చితార్దం జరిగిన విషయం తెలిసిందే.
తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెదేపా ఆధ్వర్యంలో కాంతితో క్రాంతి కార్యక్రమానికి పిలునిచ్చారు. ఇందులో భాగంగా నేటి రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ఇళ్లలో లైట్లు ఆపేసి, కొవ్వొత్తులు వెలిగించాలని, సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేయాలని, వాహనదారులు లైట్లు వెలిగించి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.
పాక్షిక చంద్ర గ్రహణం సందర్భంగా ఏపీలోని ప్రముఖ ఆలయాలను మూసివేయనున్నారు. తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని 28న రాత్రి 7.05 నుంచి తెల్లవారుజామున 3.15 వరకు ఆలయాన్ని మూసేస్తారు. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని అక్టోబర్ 28 (2023)న సాయంత్రం 6 గంటల నుంచి 29న తెల్లవారుజామున 3.30 గంటల వరకు మూసివేయనున్నారు.
పొత్తులపై తాము ఎవరికీ చెప్పాల్సిన పనిలేదని ప్రజలకే చెబుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ మేము ఎన్ని చోట్ల పోటీ చేస్తాం.. ఎవరితో పొత్తు పెట్టుకుంటామనేది మీకు అనవసరమని వైసీపీ నేతలకు పరోక్షంగా సెటైర్లు వేసారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో ఎసిబి కోర్టు జడ్జి హిమబిందు తీర్పుని రిజర్వ్ చేశారు. సోమవారంనాడు తీర్పు ప్రకటిస్తామని ఎసిబి కోర్టు ప్రకటించింది.
వైసీపీ నేత వేధింపులు తాళలేక టీటీడీ ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను సూసైడ్ నోట్లో రాశారు. ఈ ఘటన పేరూరులో తీవ్ర కలకలం రేపింది. పేరూరుకు చెందిన మునస్వామికి స్థానికంగా కొంత వ్యవసాయ భూమి ఉంది
దళితులను చంపేసిన ఎమ్మెల్సీకి ఊరేగింపులు చేస్తారు వైసీపీ నేతలు అంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. నేడు కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం లోని ముదినేపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. నాలుగో దశ వారాహి యాత్రలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నేడు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లిలో జనసేనాని ఇవాళ పర్యటించనున్నారు. ఈ మేరకు ముదినేపల్లిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. యాత్రలో చివరి రోజు కావడంతో
కడప కోఆపరేటివ్ కాలనీలో దారుణం జరిగింది. భార్య పిల్లల్ని గన్ తో షూట్ చేసిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తర్వాత ఆత్మ హత్య చేసుకున్నాడు. ఇద్దరి భార్యల మధ్య ఆస్తి గొడవలు జరుగుతుండటంతో మొదటి భ్యార్యను హత్య చేసి తాను ఆత్మ హత్య చేసుకున్నాడు.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకునే వేడుకల్లో దసరా కూడా ఒకటి. విజయ దశమిని పురస్కరించుకొని విజయవాడలోని కనకదుర్గ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ఏపీకి తెలంగాణతో పాటు కర్ణాటక, చెన్నై నుంచి కూడా భక్తులు వస్తుంటారు. దుర్గమ్మ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుందనే