Last Updated:

Chandrababu Petitions: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో ఎసిబి కోర్టు జడ్జి హిమబిందు తీర్పుని రిజర్వ్ చేశారు. సోమవారంనాడు తీర్పు ప్రకటిస్తామని ఎసిబి కోర్టు ప్రకటించింది.

Chandrababu Petitions: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై  ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు

 Chandrababu Petitions: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో ఎసిబి కోర్టు జడ్జి హిమబిందు తీర్పుని రిజర్వ్ చేశారు. సోమవారంనాడు తీర్పు ప్రకటిస్తామని ఎసిబి కోర్టు ప్రకటించింది.

మరో మూడు రోజులు కస్టడీకి ..( Chandrababu Petitions)

చంద్రబాబుని 3 రోజుల కస్టడీకివ్వాలని సిఐడి కోరుతోంది. ఆర్ధిక లావాదేవీలపై చంద్రబాబునుంచి వివరాలు తీసుకోవాల్సి ఉందని ఎఎజి పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు ఆదాయపు పన్ను వివరాలని కూడా సేకరిస్తున్నామని పొన్నవోలు చెప్పారు. చంద్రబాబు బ్యాంకు ఖాతాల వివరాలు కూడా తెలుసుకోవాల్సి ఉందని పొన్నవోలు తెలిపారు. చంద్రబాబుకు బెయిల్ ఇస్తే ఆడిటర్ వెంకటేశ్వర్లును మేనేజ్ చేస్తారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ ఖాతాకు నిధులు మళ్లించారు. సీఐడీకి ఇచ్చిన కస్టడీలో చంద్రబాబు సహకరించలేదు. అందుచేత మరో మూడురోజుల కస్టడీకి ఇవ్వండని పొన్నవోలు కోరారు.

అయితే ఇప్పటికే ఓసారి కస్టడీకిచ్చారని చంద్రబాబు లాయర్ దూబే గుర్తు చేశారు. మరోసారి కస్టడీ అవసరం లేదని దూబే వాదనలు వినిపించారు. ఈ కేసులో విడుదలయిన నిధులకు, చంద్రబాబుకు సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ అక్కౌంట్లలో జమ అయిన నిధులు పార్టీకి వచ్చిన విరాళాలు. వీటికి, స్కిల్ స్కాంకు సంబంధం లేదని అన్నారు. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ పిటి వారెంట్ లపై వాదనలు సోమవారం వింటామని ఎసిబి కోర్టు న్యాయమూర్తి తెలిపారు.