Home / ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశం కానుంది.
ఆంధ్రప్రదేశ్ లో అమలు జరుగుతున్న ఆరు సామాజిక సంక్షేమ పథకాల పేర్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.వాటిలో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన (ఎస్సీల కోసం), వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ విద్యోన్నతి మరియు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం ఉన్నాయి.Latest
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సర్వమత ప్రార్థణల అనంతరం సచివాలయంలోని బ్లాక్ 2లో తనకు కేటాయించిన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు.
ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. సచివాలయంలోని తన ఛాంబర్లో చంద్రబాబు నాయుడు పవన్‌కల్యాణ్‌కు స్వాగతం పలికారు.
ఈవీఎంలపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలన్ ఎక్స్ లో తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారు తప్ప ఈవీఎంలు కాదన్నారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించే ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వై ప్లస్ కేటగిరీ భద్రతను కేటాయించింది. వై ప్లస్ భద్రత కల్పించడంతో పాటు పవన్ కళ్యాణ్ కోసం ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది.
తాము అధికారంలో ఉన్నపుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 72 శాతం పూర్తయిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని 7 మండలాలను కలపడంతోనే ప్రాజెక్టు ముందుకు సాగిందని చెప్పారు. గత ప్రభుత్వం ప్రాజెక్టును ఇబ్బందులు పాలుజేసిందని అన్నారు.
ఏపీ అసెంబ్లీ స్పీకర్ పదవి టీడీపీకి చెందిన సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంనుంచి అయ్యన్న ఏడవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు
ఆ ఊరులో గ్రామదేవత పోలేరమ్మ అమ్మవారికి ఊరంతా కలసి 101 కోళ్లతో మొక్కులు తీర్చుకున్నారు. మొక్కుతీర్చుకుంటే మాములు విషయమే కదా అని అనుకుంటే పొరపాటే ..ఆ మొక్కుకు ఒక లెక్కవుంది
సీఎం చంద్రబాబు పోలవరం చేరుకున్నారు. పోలవరాన్ని చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. పోలవరం చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ నేతల ఘన స్వాగతం పలికారు. పోలవరం ప్రాజెక్టు పనులను చంద్రబాబు పరిశీలిస్తున్నారు.