Last Updated:

Ayyanna Patrudu: ఏపీ అసెంబ్లీ స్పీకర్‎గా చింతకాయల అయ్యన్నపాత్రుడు?

ఏపీ అసెంబ్లీ స్పీకర్‎ పదవి టీడీపీకి చెందిన సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంనుంచి అయ్యన్న ఏడవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు

Ayyanna Patrudu: ఏపీ అసెంబ్లీ స్పీకర్‎గా చింతకాయల అయ్యన్నపాత్రుడు?

Ayyanna Patrudu: ఏపీ అసెంబ్లీ స్పీకర్‎ పదవి టీడీపీకి చెందిన సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంనుంచి అయ్యన్న ఏడవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొన్ని సామాజిక సమీకరణాల రీత్యా ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఈ నేపధ్యంలో అయ్యన్నను అసెంబ్లీ స్పీకర్ గా నియమించాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అయితే నక్కా ఆనందబాబు, కళా వెంకటరావు స్పీకర్ రేసులో ఉన్నారు. డిప్యూటీ స్పీకర్ జనసేనకు దక్కే అవకాశం ఉంది. జనసేన నుంచి డిప్యూటీ స్పీకర్ రేసులో లోకం మాధవి, పంతం నానాజీ ఉన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్‎గా ధూళిపాళ్ల నరేంద్రను నియమిచే చాన్స్ ఉంది.

జనసేనకు డిప్యూటీ స్పీకర్..(Ayyanna Patrudu)

ఇప్పటికే మంత్రివర్గంలో జనసేనకు మూడు మంత్రిపదవులు ఇచ్చారు. పవన్ కల్యాణ్‌కి ఉప ముఖ్యమంత్రిని చేశారు. ఈ క్రమంలోనే మరో కీలకమైన డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేన నేతలకు అప్పగించాలని చంద్రబాబు భావిస్తునట్లు తెలుస్తోంది. జనసేన సీనియర్ నేతల్లో నాదెండ్ల మనోహర్ కు డిప్యూటీ స్పీకర్ ,స్పీకర్ గ పనిచేసిన అనుభవం వుంది .కానీ ఇప్పటికే నాదెండ్ల ను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ,జనసేన నుంచి డిప్యూటీ స్పీకర్ పదవి ఈవారిని వరించనుందో నని సర్వత్రా చర్చ జరుగుతోంది .జనసేనలో మరో సీనియర్ నేత అవనిగడ్ద ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కు డిప్యూటీ స్పీకర్ ఇచ్చే ఛాన్స్ కూడా వుంది .2014 – 2019 మధ్య కాలం లో టీడీపీ ప్రభుత్వంలో బుద్ధ ప్రసాద్ డిప్యూటీ స్పీకర్ గా పనిచేసారు .అదే విధంగా జనసేనలో కొణతాల రామకృష్ణ ,బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి సీనియర్లు వున్నారు .వాళ్లకు కూడా ఏదైనా ప్రాధాన్యత గల పోస్ట్ దక్కనుందని తెలుస్తోంది .ఏది ఏమైనా త్వరలోనే ఈ సస్పెన్సు కు తెరపడనుంది.

ఇవి కూడా చదవండి: