Last Updated:

Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వై ప్లస్ సెక్యూరిటీ

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించే ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వై ప్లస్ కేటగిరీ భద్రతను కేటాయించింది. వై ప్లస్ భద్రత కల్పించడంతో పాటు పవన్ కళ్యాణ్ కోసం ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది.

Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వై ప్లస్ సెక్యూరిటీ

Deputy CM Pawan Kalyan:  ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించే ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వై ప్లస్ కేటగిరీ భద్రతను కేటాయించింది. వై ప్లస్ భద్రత కల్పించడంతో పాటు పవన్ కళ్యాణ్ కోసం ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. ఆయన బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

అధికారులతో చర్చలు..(Deputy CM Pawan Kalyan)

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. విజయవాడ ఇరిగేషన్ క్యాంపు కార్యాలయాన్ని పవన్ కోసం కేటాయించారు. పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను పరిచయం చేసుకున్నారు. రేపు సచివాలయంలో బాధ్యతల స్వీకరణపై చర్చించారు.అనంతరం సచివాలయంలోని రెండో బ్లాక్‌లో సిద్ధమవుతున్న తన ఛాంబర్‌ను పరిశీలించనున్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక పవన్ సచివాలయానికి రావడం ఇదే తొలిసారి కావడంతో.. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును పవన్​ మర్యాదపూర్వకంగా కలుసుకోనున్నారు. అంతకుముందు ప్రత్యేకవిమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కు జనసేన నేతలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.

 

 

ఇవి కూడా చదవండి: