Home / ఆంధ్రప్రదేశ్
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలపై నేడు ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు పాల్గొననున్నారు. వీరితో పాటు ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు, ఇతర కీలక శాఖల కూడా హాజరుకానున్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు తిరుమల బ్రహ్మోత్సవాలకు హాజరుకానున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. తిరుపతి జిల్లాలో ఆయన రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.
దసరా వేడుకలు సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న క్రమంలో విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కనక దుర్గ అమ్మవారి దర్శనానికి వచ్చే దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే వృద్ధులు,దివ్యాంగులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆలోచన చేసి అదేశాలు జారీ చేసింది.వారికి వారికి సౌకర్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని,అలాగే ప్రత్యేక సమయం కేటాయిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
తిరుమలకు విచ్చేసే ఇతర మతస్ధులు దేవస్ధానంకు డిక్లరేషన్ ఇచ్చి కలియుగ దైవాన్ని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సీఎం జగన్ డిక్లరేషన్ ఇచ్చి తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనందసూర్య కోరారు.
మాజీ సీఎం, టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) పై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ మంత్రి దాడిశెట్టి రాజాపై మాజీ మంత్రి కేఎస్ జవహర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
వైఎస్సాఆర్ జిల్లా చక్రాయపేటలో దొంగలు హల్ చల్ చేసారు. స్టేట్ బాంకు ఆఫ్ ఇండియా ఎదురుగా ఉన్న ఓ దుకాణాన్ని లూటీ చేసేందుకు ముగ్గురు యువకులు ప్రయత్నించారు.
అమరావతి నుండి అరసవల్లి వరకు తలపెట్టిన అమరావతి రాజధాని రైతుల పాదయాత్రలో ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజధాని నిర్మాణం కొరకు నాడు భూములు లిచ్చిన రైతులు, రైతు కూలీలు రాజధానిగా ఎందుకు అమరావతినే కోరుకుంటున్నామో తెలుపుతూ పాదయాత్రలో తమ పాత్రను పోషిస్తున్నారు
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఏపీలో వివాదం రేగుతున్న సమయంలో మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు
గత ప్రభుత్వంలో బీడుబారిన భూములు, నేటి జగన్ ప్రభుత్వంలో పచ్చని బంజరు భూములు గా ప్రచారం చేసే వైకాపా వర్గాలకు మాజీ హోం మంత్రి సుచరిత జలక్ ఇచ్చారు.
ఏపి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బలు ఆగడం లేదు. రాష్ట్రంలో చోటుచేసుకొంటున్న పరిపాలన అంశాలపై ఇప్పటికే ఏపి సీఎం జగన్ కు సుప్రీం కోర్టు ఎన్నో మొట్టికాయలు వేసింది. తాజాగా పోలవరం ప్రాజెక్టుపై సర్వోత్తమ న్యాయస్ధానంలో ఏపి ప్రభుత్వానికి షాక్ తగిలింది