Sucharita : అధికారులపై మాజీ హోం మంత్రి రుసరుసలు
గత ప్రభుత్వంలో బీడుబారిన భూములు, నేటి జగన్ ప్రభుత్వంలో పచ్చని బంజరు భూములు గా ప్రచారం చేసే వైకాపా వర్గాలకు మాజీ హోం మంత్రి సుచరిత జలక్ ఇచ్చారు.
Ex Minister Sucharita: గత ప్రభుత్వంలో బీడుబారిన భూములు, నేటి జగన్ ప్రభుత్వంలో పచ్చని బంజరు భూములు గా ప్రచారం చేసే వైకాపా వర్గాలకు మాజీ హోం మంత్రి సుచరిత జలక్ ఇచ్చారు. చుక్క నీరు లేకుండా అల్లాడుతున్న రైతాంగం పట్ల మీరు తీసుకొనే చర్చలు ఇవేనా అంటూ సుచరిత అసహనం వ్యక్తం చేసిన ఘటన కాకుమానులో చోటుచేసుకొనింది.
వివరాల మేరకు, కాకుమానులో నీటి పారుదల శాఖ అధికారులతో మాజీ మంత్రి సుచరిత సమీక్ష నిర్వహించారు. సీజన్ ప్రారంభం నాటికి కూడా కాల్వలలో పూడిక ఎందుకు తీయలేదని అధికారులను నిలదీసారు. అప్పాపురం ఛానల్ కింద 30వేల ఎకరాల పంట భూమికి నీరు అందించేది ఎలా నంటూ ప్రశ్నించారు. దీంతో నీళ్లు నమలడం అధికారుల వంతైంది.
అధికారుల నిర్లక్ష్యంతో ఛానల్ కింద వున్న భూములకు అందడం లేదని రైతులు మాజీ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సగానికి పైగా పొలాలకు చుక్కనీరు అందలేదని రైతులు ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్లతో అధికారుల కుమ్మక్కై అన్నదాతలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా పూడికను తీయాలంటూ అధికారులను సుచరిత ఆదేశించారు.
ఇది కూడా చదవండి : Supreme Court: జగన్ కు సుప్రీంలో మరో ఎదురు దెబ్బ