Home / ఆంధ్రప్రదేశ్
సొంత చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన వ్యక్తులను ఎందుకు పట్టుకోవడం లేదని తెదేపా నేత బొండా ఉమ సీఎం జగన్ ను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
సొంతజిల్లా అభివృద్ధిని గాల్లోకివదిలేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లావాసులకు క్షమాపణ చెప్పాలని భాజపా నేత విష్ణువర్ధన రెడ్డి డిమాండ్ చేశారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రొబేషన్ పీరియడ్లో విధులు నిర్వహిస్తూ, మరణించిన వారి ఉద్యోగాలను కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేయనుంది.
విశాఖపట్నం రిషికొండ వద్ద నిరసనకు పిలుపునిచ్చిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. నిన్న అర్ధ రాత్రి నుండి టీడీపీ నాయకుల హౌస్ అరెస్టులు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్బంధాలపై ట్వట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
విజిలెన్స్ అధికారుల తీరును నిరసిస్తూ తిరుమల క్షురకులు నిరసనలకు దిగారు. దీంతో ప్రధాన కల్యాణ కట్టతో పాటు పలు ప్రాంతాల్లో తలనీలాలు సమర్పించేందకు భక్తులు బారులు తీరారు.
పేదల ఇండ్ల నిర్మాణంలో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఏపీ ప్రభుత్వ తీరు ఉందంటూ జనసేన పార్టీ విమర్శించింది. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం అసమర్ధ చర్యలను ఆ పార్టీ ఆధారాలతో పేర్కొనింది.
సమస్యలు విన్నవించుకోవాలంటూ సీఎం జగన్ కాన్వాయ్ ను అడ్డుకొనేందుకు ఓ కుటుంబం ప్రయత్నించింది. ఈ ఘటన గన్నవరం విమానాశ్రయం సమీపంలో చోటుచేసుకొనింది.
రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా మారుమూడి విక్టర్ప్రసాద్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని తిరుపతి జిల్లాలో సూళ్లూరుపేట ఆర్యవైశ్యులు డిమాండ్ చేశారు. జాతిపిత మహాత్మ గాంధీపై ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ముక్కాల ద్వారకానాధ్ పిలుపు మేరకు సూళ్లూరుపేటలో నిరసనలు వ్యక్తం చేశారు.
రాజ్యసభ సభ్యత్వం, వక్ప్ బోర్డ్ చైర్మన్ , ఎమ్మెల్సీ ఇలా సినీ నటుడు అలీకి జగన్ ఏ పదవి ఇస్తారన్న దానిపై గత కొద్దికాలంగా రకరకాల ఊహాగానాలు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను ఓ కళంకిత అధికారిగా టీడీపీ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. సీఐడీ అనేది ఒక ధర్మపీఠం, అందరికీ సమానంగా న్యాయం చేయాల్సి ఉందని తెలిపారు.