Home / ఆంధ్రప్రదేశ్
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూళ్లూరుపేట పురపాలక సంఘ పరిధిలో అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు.
పంపుడు స్టోరేజి ప్లాంట్స్ (పిఎస్పీ) స్కీం కింద కడపకు చెందిన సీఎం జగన్ బినామీ కంపెనీ షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ కు వందల ఎకరాల భూమి ధారదత్తం చేశారని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ రుజువులతో మీడియాకు చూపించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది నవంబర్ 11న ఏపీలోని విశాఖపట్టణంలో పర్యటిస్తారు.
చిన్నచిన్న గొడవలే ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. పచ్చని కాపురంలో చెలరేగిన మంటలు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణ కాస్త తండ్రి, కుమారుల మరణానికి దారి తీసింది.
సీనియర్ సెటిజన్లు, దివ్యాంగులకు తితితే శుభవార్తను అందించింది. నవంబర్ నెలలో వారి కోటాలోని శ్రీవారి దర్శనం టిక్కెట్లను ఆన్ లైన్ బుక్ చేసుకొనేందుకు వివరాలను తెలిపింది. అక్టోబర్ 26 మద్యాహ్నం 3గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
పొలం కూలీలపై తేనిటీగలు దాడి చేశాయి. ఘటనలో ఒకరు మృతి చెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకొనింది.
ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు వందల రోజుల తరబడి పేదలకు అన్నదానం చేస్తున్నారు. పేదల ఆకలిని తీర్చేందుకు వారు నడుంబిగిస్తే, మేము మీకు తోడంటూ దాతలు క్యూ కడుతున్నారు. ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం తీసుకొచ్చిన అన్నా క్యాంటిన్ పధకాన్ని రద్దు చేసింది. దీంతో పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామా నాయుడు పేదల ఆకలి తీర్చేందుకు నడుం బిగించారు.
ఏపీ మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, వైకాపా పార్టీ తొత్తుగా వ్యవహరిస్తున్నారని జనసేన పార్టీ దెందలూరు నాయకురాలు గంటసాల వెంకటలక్ష్మీ మండిపడ్డారు. మీడియాతో మాట్లాడిన ఆమె వాసిరెడ్డి పద్మపై విరుచుకపడ్డారు.
ఏపీ పోలీసుల తీరు ఏ విధంగా సమర్ధనీయంగా ఉండడం లేదు. తాజాగా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొన్న చందంగా విజయవాడ దీపావళి టపాకాయలు అమ్మే వ్యాపారులపై పోలీసులు పడ్డారు. సాయంత్రం 6 దాటింది ఇకపై టపాసులు అమ్మేందుకు వీలులేదని ఆంక్షలు విధించారు.
శ్రీకాకుళం జిల్లాలో పోలీసులపై గ్రామస్ధులు దాడి చేశారు. ఇరువర్గాల మద్య చోటుచేసుకొన్న ఓ ఘటన నేపథ్యంలో ఘర్షణ చోటుచేసుకొనింది.