Vysyas protests: ఎస్సీ కమీషన్ చైర్మన్ రాజీనామా చేయాలంటూ ఆర్యవైశ్యుల నిరసనలు.. ఎందుకంటే?
రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా మారుమూడి విక్టర్ప్రసాద్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని తిరుపతి జిల్లాలో సూళ్లూరుపేట ఆర్యవైశ్యులు డిమాండ్ చేశారు. జాతిపిత మహాత్మ గాంధీపై ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ముక్కాల ద్వారకానాధ్ పిలుపు మేరకు సూళ్లూరుపేటలో నిరసనలు వ్యక్తం చేశారు.
Sullurpet: రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా మారుమూడి విక్టర్ప్రసాద్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని తిరుపతి జిల్లాలో సూళ్లూరుపేట ఆర్యవైశ్యులు డిమాండ్ చేశారు. జాతిపిత మహాత్మ గాంధీ పై ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ముక్కాల ద్వారకానాధ్ పిలుపు మేరకు సూళ్లూరుపేటలో నిరసనలు వ్యక్తం చేశారు.
స్థానిక గడియారం స్ధంభం నుండి ర్యాలీగా బయల్దేరిన వైశ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రసాద్ కు వ్యతిరేకంగా నినదించారు. మహాత్ముని జోహార్లతో పట్టణ పురవీదులు హోరెత్తాయి. అదే క్రమంలో ఎస్సీ కమీషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్ డౌన్ డౌన్ అన్న నినాదాలు స్థానికులను ఆలోచింపచేశాయి. అనంతరం బస్టాండు సెంటర్ వద్ద ఉన్న మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి, పాలాభిషేకాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వైశ్యులు మాట్లాడుతూ జాతి విభేధాలు సృష్టిస్తే ఒప్పుకొనేది లేదన్నారు. ప్రజల మద్య చిచ్చుపెట్టిన ప్రసాద్ ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. గాంధీపై ప్రసాద్ చేసిన నిరాధారమైన ఆరోపణలను వారు ఖండించారు. ఘటనపై ముఖ్యమంత్రి జగన్ దీనిపై స్పందిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్నప్తి చేశారు.
కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన న్యాయవాది విక్టర్ ప్రసాద్ దళితుల సమస్య లపై 30 ఏళ్లుగా అనేక ఉద్యమాలు చేసిన నేపథ్యంలో ఆయన్ను నేటి ప్రభుత్వం 2021 ఆగస్ట్ లో ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియమించింది. మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్న ప్రసాద్, మహాత్మ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆర్యవైశ్యులు మండిపడ్డారు. పార్టీలకతీతంగా సూళ్లూరుపేట ఆర్యవైశ్యులు ఎస్సీ కమీషన్ ఛైర్మన్ ఆరోపణలను తిప్పికొట్టారు. తిరుపతి, నెల్లూరు జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం సూళ్లూరుపేట ఎంతో కీలకమైంది. ఆ ప్రాంతంలో వైశ్యులంతా ఒక్కటై ఎస్సీ కమీషన్ ఛైర్మన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ నెల్లూరు పర్యటనలో ఆర్యవైశ్యులు తమ నిరసనలు చేపట్టి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
కార్యక్రమంలో అలవల సురేష్, అయితే శ్రీధర్, కాకి శ్రీరామ్మూర్తి, దుర్గి రమేష్, పివి కిషోర్, కోట నాగేశ్వరరావు, తన్నీరు సృజన్, బండారు ఆంజనేయులు, కాళంగి పవన్, అద్దంకి శ్రీనివాసులు, చిన్ని సత్యన్నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Varla Ramaiah: సీఐడి చీఫ్ ఓ కళంకిత అధికారి.. తెదేపా నేత వర్ల రామయ్య