Home / ఆంధ్రప్రదేశ్
మెగాస్టార్ చిరంజీవి నేడు హైదరాబాదులోని వైఎన్ఎం కాలేజి పూర్వవిద్యార్థుల సమ్మేళనానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ రాజకీయాలపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కూడా అనుకున్నది చేసే రకమని ఆయన వెల్లడించారు. రాజకీయాలకు పవన్ తగినవాడు అని పేర్కొన్నారు.
విశాఖ ప్రైవేటీకరణపై ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. దేశం, రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ప్రత్యర్థులు బలంగా ఉండాలని తద్వారా ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను తిప్పి కొట్టవచ్చని చెప్పుకొచ్చారు. స్టీల్ ప్లాంట్ కోసం జరిగే ఉద్యమంలో ఒకొక్కరు కాకుండా కుటుంబ సమేతంగా లేదా మూకుమ్మడిగా వందలు వేలాది మంది తరలిరావడం ద్వారానే మన ఉక్కుపరిశ్రమను మనం కాపాడుకోగలమని ఆయన తెలిపారు.
తెలుగురాష్ట్రాల్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం తొమ్మిది పదిగంటలైనా పొగమంచు వీడడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో చలి పంజా విసురుతున్నది.
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో హంగ్ రావాలని బీజేపీ భావిస్తోందా? అలా జరిగితేనే ఫస్ట్ టైం జనసేనతో కూడి పవర్ లోకి వస్తామని ఆశ పడుతోందా? ఇది మొదటి ఆప్షన్ గా పెట్టుకుని బీజేపీ కేంద్ర నాయకత్వం మాస్టర్ స్ట్రాటజీని సెట్ చేసి పెట్టిందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు
వచ్చే అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత మహిళా నేతలను అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి నారా లోకేష్ ఖండించారు. నిత్యం నోటికొచ్చినట్లు మాట్లాడే కొడాలి నానిని ఎన్నిస్లారు అరెస్ట్ చేయాలని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
ఏపీలో మందుబాబులకు శుభవార్త అందింది. ఇక నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నారు.
అయ్యప్ప దర్శనానికి వెళ్లివస్తోండగా కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులతో వస్తోన్న ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మందికి గాయాలు అయ్యాయని అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది.
ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు.
వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ చేపట్టిన 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. తాజాగా 'ఇదేం కర్మ' అనే కార్యక్రమానికి తెలుగుదేశం శ్రీకారం చుట్టబోతోంది.