Last Updated:

Republic Day 2025: గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో

Republic Day 2025: గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో

Indonesian President Prabowo Subianto To Be Chief Guest For Republic Day 2025: గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో పర్యటన దాదాపు ఖరారైంది. ఆయన 2024 అక్టోబర్‌లో ఇండోనేషియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఇరుదేశాల సంబంధాలపై ప్రధాని మోదీతో విస్తృత చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే గణతంత్ర వేడుకల అనంతరం ప్రబోవో పాకిస్తాన్ వెళ్లే అవకాశం లేదని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అయితే దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే గణతంత్ర వేడుకలకు అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోను భారత్ ఆహ్వానించినట్లు ఆ దేశం తెలిపింది. కాగా, ప్రబోవో భారత్ నుంచి పాకిస్తాన్ పర్యటించేందుకు షెడ్యూల్ సైతం ప్రకటించారు. ఈ విషయంలో భారత్ అభ్యంతరం తెలిపింది. దీంతో పాకిస్థాన్ పర్యటన ఉండకపోవచ్చని సమాచారం.

ఇదిలా ఉండగా, ఇప్పటివరకు భారత్ దేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన విదేశీ పెద్దలు నేరుగా పాకిస్తాన్‌కు వెళ్లలేదు. కానీ, ఇండోనేషియా అధ్యక్షుడు షెడ్యూల్‌లో భారత్ వెంటనే పాకిస్తాన్ పర్యటన ఉండటంతో గణతంత్ర దినోత్సవ వేడుకల ముఖ్య అతిథిగాపై ప్రకటన పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే గతేడాది ప్రబోవో ప్రధాని మోదీకి ఫోన్‌ చేసి ఇరుదేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు. నవంబర్‌లో బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులో ప్రబోవో ప్రధాని, విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌‌తో వాణిజ్యం, ఆరోగ్యం, భద్రత వంటి రంగాలలో సహకారంపై చర్చలు జరిపారు.