Home / ఆంధ్రప్రదేశ్
ప్రతి ఏడాది ఎంతో ఘనంగా మతసామరస్యానికి అద్దం పట్టేలా.. నిర్వహిస్తున్న నెల్లూరులో రొట్టెల పండుగ ఇవాళ్టి నుంచి ప్రారంభం అయ్యింది. ఈ మేరకు నెల్లూరు లోని స్వర్ణాల చెరువు, బారాషహీద్ దర్గా వద్ద ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఈ పండుగలో పాల్గొనేందుకు.. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. రాష్ట్ర సర్కారుపై నిప్పులు చెరిగారు. ఏపీ బీజేపీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వరుస ప్రెస్ మీట్లలో జగన్ ప్రభుత్వ వైఫల్యంపై ఆమె గళం విప్పుతూనే ఉన్నారు. ఈ మేరకు తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం లెక్కకు మిక్కిలిగా అప్పులు
ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించి మంచి లను సాధించారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పీరియాడికల్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. క్రిష్ దరకత్వం వహిస్తున్నారు.
పల్నాడు జిల్లాలో హైటెన్షన్..టీడీపీ,వైసీపీ మధ్య ఘర్షణ. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వినుకొండలో గురువారంనాడు టీడీపీ, వైఎస్ఆర్సీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినట్టుగా సమాచారం.
అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో కురిసిన భారీ వానలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని 5 జిల్లాలకు రెడ్ అలెర్ట్, 20 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ
మెగాస్టార్ చిరంజీవికి హైకోర్టులో ఊరట లభించింది. 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చిరంజీవిపై పెట్టిన కేసును ఏపీ హైకోర్ట్ కొట్టేసింది. దాదాపు 9 ఏళ్ళ క్రితం గుంటూరు, అరండల్ పేట పోలీసులు నమోదు చేసిన కేసును తాజాగా హైకోర్టు కొట్టివేసింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా గుంటూరు రైల్వే కోర్టులో జరుగుతున్న విచారణను నిలిపివేసింది. జరిమానా విధించాలన్న
ప్రస్తుత కాలంలో బైక్, కార్ ఇలా ఏదో ఒక వాహనం అందరి ఇళ్ళల్లోనూ ఉంటుంది. అయితే పెరిగిపోతున్న జనాభా కారణంగా ట్రాఫిక్ దేశ వ్యాప్తంగా.. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ట్రాఫిక్ సమస్యలు ఏ విధంగా ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పోలీసులు ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన కల్పిస్తున్నప్పటికి
విశాఖ పట్టణం ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి కేసులో ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ను ఎన్ఐఏ కోర్టు కొట్టివేసింది. కుట్ర కోణంపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని గతంలో సిఎం వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ని ఇప్పుడు ఎన్ఐఎ కోర్టు కొట్టేసింది.
వైకాపా మంత్రి జోగి రమేశ్ కి జనసేన నేతలు చుక్కలు చూపించారు. ఇటీవల జనసేన అధినేత పవన్ పై మంత్రి జోగి రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మార్చడం, తార్చడం వంటివి పవన్ కు అలవాటేనని ఆయన అన్నారు. పెళ్లాలనే కాకుండా పార్టీలను కూడా మారుస్తుంటారని విమర్శించారు. కాగా ఈ వ్యాఖ్యలను
టీటీడీ చైర్మన్ పదవి రాయలసీమలో 20 లక్షలు జనాభా ఉన్న బలిజలకు ఇవ్వాలని హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య మరోలేఖ రాశారు. ఇప్పటికే పలు అంశాలను లేఖల ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఆయన.. ఇప్పుడు టీటీడీ చైర్మన్ వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.