Last Updated:

New Traffic Rule : ఏపీలో డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్, హెడ్‌సెట్ పెట్టుకుంటే 20 వేలు ఫైన్..

ప్రస్తుత కాలంలో బైక్, కార్ ఇలా ఏదో ఒక వాహనం అందరి ఇళ్ళల్లోనూ ఉంటుంది. అయితే పెరిగిపోతున్న జనాభా కారణంగా ట్రాఫిక్ దేశ వ్యాప్తంగా.. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ట్రాఫిక్ సమస్యలు ఏ విధంగా ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పోలీసులు ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన కల్పిస్తున్నప్పటికి

New Traffic Rule : ఏపీలో డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్, హెడ్‌సెట్ పెట్టుకుంటే 20 వేలు ఫైన్..

New Traffic Rule : ప్రస్తుత కాలంలో బైక్, కార్ ఇలా ఏదో ఒక వాహనం అందరి ఇళ్ళల్లోనూ ఉంటుంది. అయితే పెరిగిపోతున్న జనాభా కారణంగా ట్రాఫిక్ దేశ వ్యాప్తంగా.. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ట్రాఫిక్ సమస్యలు ఏ విధంగా ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పోలీసులు ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన కల్పిస్తున్నప్పటికి.. వాహనదారులు వాటిని అతిక్రమిస్తూనే ఉంటున్నారు. అందుకు గాను ఛలానాలు విధిస్తున్నప్పటికి కూడా కొందర్లో మార్పు రావడం లేదు.

ఇక ఇటీవల కాలంలో వాహనాన్ని నడుపుతూ.. హెడ్ సెట్ పెట్టుకుని ఫోన్ మాట్లాడడం, పాటలు వినడం చేస్తూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. వాహనం నడుపుతూ ఇలా హెడ్ సెట్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ పెట్టుకుంటే వెనుక నుంచి హారన్ కొట్టేది కూడా తెలీదు. ఎవరైనా ఓవర్ టేక్ చేయాలన్నా కూడా ఇబ్బంది కలిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అందుకే ఏపీ సర్కార్ కఠినమైన జరిమానా విధించేందుకు సిద్దమైంది.

ఈ క్రమంలోనే ఎక్కువగా పలువురు ప్రమాదాల బారిన పడిన సంఘటనలను గమనించవచ్చు. ఇలాంటి పనుల కారణంగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని.. జీవితాలు అర్థాంతరంగా ఆగిపోతున్నాయని ఏపీ సర్కార్ గుర్తించింది. ఈ క్రమంలోనే సంచలన నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్, హెడ్‌సెట్ పెట్టుకుంటే 20,000 ఫైన్ వేయబోతున్నట్లు తెలిపింది. కాగా ఆగస్టు నెల నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుందని ప్రకటించింది. బైక్ మీద మాత్రమే కాదు.. కారు కానీ ఆటో కానీ.. మరే ఇతర వాహనంలో అయినా కానీ ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ పెట్టుకుని.. వాహనాన్ని నడిపితే మాత్రం 20,000 జరిమానా విధించనున్నారు.