Published On:

Hair Growth: జుట్టు ఊడకుండా ఒత్తుగా పెరగాలంటే..? ఈ చిట్కా మీకోసమే..!

Hair Growth: జుట్టు ఊడకుండా ఒత్తుగా పెరగాలంటే..? ఈ చిట్కా మీకోసమే..!

Hair Growth: జుట్టు పెరగట్లేదని చాలా మంది బాధపడుతుంటారు. ఎలాంటి ప్రయత్నాలు చేసినా.. లాభం లేదని ఒత్తిడికి లోనవుతారు. అయితే ఇంట్లోనే కొన్ని చిట్కాలతో మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. ప్రస్తుతం ప్రతిఒక్కరూ జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. పోషకాహారం తీసుకోకపోవడం, ఎక్కువగా నీరు తాగకపోవడం, నిద్రలేమి, ఒత్తిడి, పొల్యూషన్ వంటి కారణాల వల్ల జుట్టు రాలిపోతుంటుంది. అయితే, అలా కాకుండా జుట్టు రాలడం తగ్గి పొడుగ్గా పెరగాలంటే.. మంచి లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వాలి. దీంతో పాటు హెయిర్ కేర్‌ పాటించాలి. హెయిర్‌కేర్‌లో ముఖ్యంగా జుట్టుకి ఆయిల్ మసాజ్ చేయడం. జుట్టు పెరిగేందుకు నూనె బాగా పనిచేస్తుంది. అందుకని నూనెని ఇష్టంగా రాయడం సరికాదు. సరిగ్గా రాయాలి. అప్పుడే జుట్టుకి పోషణ అందుతుంది. జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. మరి జుట్టుకి ఎలా మసాజ్ చేయాలో ఈ చిట్కా మీకోసమే.

 

1. నూనెని సెలక్ట్ చేసుకోవడం
ముందుగా జుట్టుకి సరైన నూనెని ఎంచుకోండి. ఎప్పుడు ఒకే నూనె రాస్తామంటే కుదరదు. ఉదాహారణకి చలికాలంలో హెయిర్ ఎక్కువగా డ్రై అవుతుంది. కాబట్టి, మీరు రాసే ఏదైనా నూనెలో ఆముదం కలపండి. అదే వేసవిలో అయితే లైట్‌గా ఉండే ఆయిల్స్ ఎంచుకోండి. ఇలా ట్రై చేస్తే జుట్టు చిక్కుల్లేకుండా పొడుగ్గా పెరుగుతుంది. అలానే మీ జుట్టుని బట్టి ఆయిల్‌ని సెలక్ట్ చేసుకోండి. మీది డ్రై హెయిర్ అయితే ఆయిలీగా ఉండేది.. మీది ఆయిలీ హెయిర్ అయితే లైట్‌గా ఉండే ఆయిల్ ఎంచుకోండి.

 

2. రాసే ముందు వేడిచేయడం
జుట్టుకి నూనె రాసే ముందు కొద్దిగా నూనెను వేడి చేయండి. ఇది డబుల్ ఆయిల్ మెథడ్‌లో అయినా, లేదా నేరుగా అయినా కొద్దిగా గోరువెచ్చగా చేసి, ఆ తర్వాత జుట్టుకి అప్లే చేయండి. దీని ద్వారా నూనె నేరుగా జుట్టు కుదుళ్ళలోకి చొచ్చుకుని పోతుంది.

 

3. మసాజ్ చేయడం
ముందుగా నూనెని తీసుకుని స్కాల్ప్‌పై వేసి వేళ్లతో 3 నుంచి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత మెల్లిగా తలముందు, వెనక భాగంలో కూడా సర్కిల్ మోషన్‌లో తలమొత్తానికి మసాజ్ చేయండి.

 

4. రెగ్యులర్‌గా
జుట్టుకి నూనె రాయడం క్రమం తప్పకుండ చేస్తుండాలి. అయితే తలస్నానం చేసే ముందు రోజు లేదా అరగంట ముందు నూనె రాసి మసాజ్ చేయండి. ఆ తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం దక్కుతుంది. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే రిజల్ట్ కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి: