Last Updated:

Diwali Holidays: దీపావళికి 10 రోజుల సెలవులు..!

ఇది పండుగల సీజన్. దేశవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద వేడుగా దీపావళిని చెప్పుకోవచ్చు. అయితే పండుగంటే ఉద్యోగులు ఎవరైనా సెలవు వస్తే బాగుండు కుటుంబంతో గడపాలని చూస్తారు. కానీ, ఉద్యోగులకు పండుగల సమయంలో సెలవు లభించదు. ఈ సందర్భంగా ఓ కంపెనీ తన ఉద్యోగులకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. సర్ప్రైజ్ అంటే ఏ బోనస్సో గిఫ్ట్ లో అనుకుంటున్నారు కదా కాదండి. ఒకటి రెండు రోజులు కాకుండా ఏకంగా 10రోజులు తన ఉద్యోగులకు సెలవులు ఇచ్చింది.

Diwali Holidays: దీపావళికి 10 రోజుల సెలవులు..!

Diwali Holidays: ఇది పండుగల సీజన్. దేశవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద వేడుగా దీపావళిని చెప్పుకోవచ్చు. అయితే పండుగంటే ఉద్యోగులు ఎవరైనా సెలవు వస్తే బాగుండు కుటుంబంతో గడపాలని చూస్తారు. కానీ, ఉద్యోగులకు పండుగల సమయంలో సెలవు లభించదు. ఈ సందర్భంగా ఓ కంపెనీ తన ఉద్యోగులకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. సర్ప్రైజ్ అంటే ఏ బోనస్సో గిఫ్ట్ లో అనుకుంటున్నారు కదా కాదండి. ఒకటి రెండు రోజులు కాకుండా ఏకంగా 10రోజులు తన ఉద్యోగులకు సెలవులు ఇచ్చింది.

ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ కంపెనీ వీవర్క్ భారతదేశంలోని తన ఉద్యోగులకు 10 రోజుల దీపావళి సెలవులను ప్రకటించింది. కంపెనీ ఇచ్చిన ఈ సర్ప్రైజ్ హాలిడే బ్రేక్ విని ఉద్యోగులు ఆశ్చర్యపోతున్నారు. తమ ఉద్యోగులు దీపావళిని కుటుంబంతో, తమ ప్రియమైనవారితో జరుపుకోవడానికి ఈ సర్పైజ్‌ హాలిడేస్‌ని ప్రకటించినట్లు కంపెనీ తెలిపింది.

ఇదీ చదవండి: బాణాసంచాపై ఆంక్షలు.. 2 గంటలు మాత్రమే టపాసులు కాల్చాలి..!