Home / diwali
దేశ రాజధాని ఢిల్లీలో నిషేధం ఉన్నప్పటికీ దీపావళి రాత్రి ప్రజలు బాణసంచా కాల్చడంతో అది భారీ కాలుష్యానికి దారితీసింది. సోమవారం ఉదయం ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది.ఢిల్లీలోని అనేక ప్రాంతాల నుండి వచ్చిన దృశ్యాల్లో దట్టమైన పొగమంచు వీధులను చుట్టుముట్టడం, దృష్టిని తీవ్రంగా పరిమితం చేయడం కనిపించింది.
దీపావళి సందర్బంగా దేశరాజధాని ఢిల్లీ ప్రాంతంలో అన్ని రకాల పటాకుల ఉత్పత్తి, అమ్మకం, నిల్వ మరియు వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. కాలుష్య స్థాయిలను అరికట్టేందుకు కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సోమవారం చెప్పారు.
దేశంలో పెరుగుతున్న డిజిటల్ పేమెంట్ల కారణంగా నగదు చలామణీ భారీగా తగ్గుతూ వస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా పరిశోధన నివేదిక తెలిపింది. అక్టోబర్ 24 నుండి ప్రారంభమయ్యే దీపావళి వారంలో నగదు చెలామణి (CIC) రూ.7,600 కోట్లు తగ్గిందని తెలిపింది.
ఈ పటాకులను చూస్తే మాత్రం కాల్చకుండా అమాంతం నోట్లో వేసుకుంటాం. అదేంటి టపాసులను నోట్లో వేసుకోవచ్చు అంటున్నారు.. పటాకులు విషపూరితం కదా అనుకుంటున్నారు కదా.. కాదండీ ఈ టపాసులు మాత్రం తియ్యతియ్యగా నోటిలో వేస్తే కరిగిపోతాయి. మరి వాటి విశేషాలేంటో తెలుసుకుందామా..
ఇది పండుగల సీజన్. దేశవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద వేడుగా దీపావళిని చెప్పుకోవచ్చు. అయితే పండుగంటే ఉద్యోగులు ఎవరైనా సెలవు వస్తే బాగుండు కుటుంబంతో గడపాలని చూస్తారు. కానీ, ఉద్యోగులకు పండుగల సమయంలో సెలవు లభించదు. ఈ సందర్భంగా ఓ కంపెనీ తన ఉద్యోగులకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. సర్ప్రైజ్ అంటే ఏ బోనస్సో గిఫ్ట్ లో అనుకుంటున్నారు కదా కాదండి. ఒకటి రెండు రోజులు కాకుండా ఏకంగా 10రోజులు తన ఉద్యోగులకు సెలవులు ఇచ్చింది.
దేశవ్యాప్తంగా వైభవంగా ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ దీపావళి. ఈ పర్వదినాన దీపాలను వెలిగించడంతో పాటు, బాణాసంచా కాల్చడం అనాదిగా వస్తోందన్న అచారంగా చెప్పవచ్చు. అయితే బాణాసంచా కాల్చడం ఈ ఏడాది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పలు కఠిన ఆంక్షలను విధించింది.
దసరా అయిపోయి దీపావళి వచ్చేస్తుంది. దీపావళి పండుగను ఉత్తరాది రాష్ట్రాల్లో వైభవంగా నిర్వహించుకుంటారు. కాగా ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు శని, ఆదివారాల్లో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనింది.