Last Updated:

Valentine’s Day 2023 Offers: వాలెంటైన్స్ డే స్పెషల్ ఆఫర్స్ లాంచ్ చేసిన టెలికాం బ్రాండ్లు

వాలెంటైన్స్ డే సందర్భంగా దిగ్గజ టెలికాం సంస్థలు పలు ఆఫర్స్ ప్రకటించాయి. ప్రముఖ సంస్థలు రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా కంపెనీలు పలు రకాల ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆఫర్లను లాంచ్ చేశాయి.

Valentine’s Day 2023 Offers: వాలెంటైన్స్ డే స్పెషల్ ఆఫర్స్ లాంచ్ చేసిన టెలికాం బ్రాండ్లు

Valentine’s Day 2023 Offers: వాలెంటైన్స్ డే సందర్భంగా దిగ్గజ టెలికాం సంస్థలు పలు ఆఫర్స్ ప్రకటించాయి. ప్రముఖ సంస్థలు రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా కంపెనీలు పలు రకాల ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆఫర్లను లాంచ్ చేశాయి.

ఫిబ్రవరి 10 తర్వాత రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు వాలెంటైన్స్ డే స్పెషల్ పొందవచ్చని జియో కంపెనీ తెలిపింది. వొడాఫోన్, ఐడియా కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ ఆఫర్ వీఐ యాప్ తో రీఛార్జ్ చేసుకోవచ్చు.

జియోలో స్పెషల్ ఆఫర్స్(Valentine’s Day 2023 Offers)

జియో వాలెంటైన్ ఆఫర్ కింద వాలెంటైన్స్ డే ప్రీ పెయిడ్ ప్లాన్లను లాంచ్ చేయడంతో పాటు అదనపు డేటాతో మరికొన్ని ఆఫర్లను కూడా అందిస్తోంది. డిస్కౌంట్ కూపన్లు, మెక్ డొనాల్డ్స్ , ఫెర్స్ అండ్ పెటల్స్ వంటి బ్రాండ్ ల నుంచి ఆఫర్స్ ఉన్నాయి.

ఈ ఆఫర్స్ పొందడానికి కూపన్ కోడ్ వివరాల కోసం మై జియో యాప్ లో కూపన్ లు అండ్ విన్నింగ్ లు ట్యాబ్ ను సెలెక్ట్ చేసుకోవాలి. రూ. 349, రూ.899 , రూ. 2999 రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులు ఈ వాలెంటైన్స్ డే ప్రయోజనాలు పొందవచ్చు.

అదనంగా 12 జీబీ 4జీ డేటా, రూ. 4500 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఫ్లైట్ బుకింగ్స్ పై రూ. 750 డిస్కౌంట్ ను అందించే ఇక్సిగో ఆఫర్,

ఫెర్న్స్ అండ్ పెటల్స్ వెబ్ సైట్ లో చేసే రూ. 799 కనీస కొనుగోలుపై రూ. 150 డిస్కౌంట్,

మెక్ డొనాల్డ్స్ లో కనీసం రూ. 199 ఖర్చు చేస్తే రూ. 105 విలువైన ఉచిత మెక్ డొనాల్డ్స్ బర్గర్ వంటి ప్రయోజనాలను( సౌత్ అండ్ నార్త్ జోన్ మాత్రమే) జియో అందిస్తోంది.

వోడాఫోన్ ఐడియా లో కూడా

మరోవైపు వోడాఫోన్ ఐడియా కూడా వాలెంటైన్స్ డే స్పెషల్ ఆఫర్ లో భాగంగా రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ రీచార్జ్ చేసుకున్న కస్టమర్లు అందరికీ 5 జీబీ అదనపు డేటా ఉచితంగా ఇస్తోంది.

అయితే, 5 జీబీ అదనపు డేటా 28 రోజుల కాలపరిమితితో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

అదే ఒకవేళ వినియోగదారులు రూ. 199 నుంచి రూ. 299 మధ్య ప్లాన్స్ తో రీచార్జ్ చేసుకుంటే, 28 రోజుల వ్యాలిడిటీతో 2 జీబీ అదనపు డేటా ఉచితంగా వస్తుంది.

ఈ ఆఫర్ ఫిబ్రవరి 14 వరకు వీఐ యాప్ ని ఉపయోగించి రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.