Last Updated:

#JioHotstar: జియో సినిమా, డిస్నీప్లస్ హాట్ స్టార్ ఒక్కటయ్యాయి.. యూజర్లకు అదిరిపోయే ప్లాన్స్!

#JioHotstar: జియో సినిమా, డిస్నీప్లస్ హాట్ స్టార్ ఒక్కటయ్యాయి.. యూజర్లకు అదిరిపోయే ప్లాన్స్!

JioCinema and Disney Hotstar have finally merged into JioHotstar: ఓటీటీ యూజర్లకు అదిరిపోయే శుభవార్త. అందరూ ఊహించిన విధంగానే ప్రముఖ ఓటీటీ వేదికలు జియో సినిమా, డిస్నీప్లస్ హాట్ స్టార్ ఒక్కటయ్యాయి. ఈ రెండు యాప్‌ల విలీనం పూర్తికావడంతో దీనికి జియోహాట్‌స్టార్‌గా నామకరణం చేశారు. ఈ దిగ్గజ కంపెనీలు విలీనం కావడంతో దాదాపుగా 500కుపైగా మిలియన్ల యూజర్లు దీని పరిధిలోకి రానున్నారు. ఈ రెండు యాప్స్ ఒకే గూటికి చేరడంతో జియో డిస్నీప్లస్ హాట్ స్టార్ అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా అవతరించింది. దీంతో ఇప్పటినుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమాలోని కంటెంట్ మొత్తం ఒకే చోట దర్శనమివ్వనుంది. కాగా, ప్లేస్టోర్‌లో జియోకు 100 మిలియన్ డౌన్‌లోడ్స్ ఉండగా..హాట్‌స్టార్‌కు 500 మిలియన్ డౌన్‌లోడ్స్ ఉన్నాయి.

జియో సినిమా, డిస్నీప్లస్ హాట్ స్టార్ విలీనం కావడంతో ఇప్పటివరకు వినోదరంగంలో దేశవ్యాప్తంగా ఇదే అతిపెద్దగా ఒప్పందంగా చెప్పవచ్చు. అయితే రెండేళ్ల క్రితం లండన్ లో జరిగిన ఓ మీటింగ్‌లో రిలయన్స్ కంపెనీ, డిస్నీ స్టార్ నాన్ బైడింగ్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఎట్టకేలకు రెండు దిగ్గజ కంపెనీలు ఏకం కావడంతో యూజర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ యూజర్లకు తక్కువ ప్రీమియం ధరలకే ఎంటర్‌టైన్‌మెంట్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ జియోహాట్‌స్టార్ అతిపెద్ద ప్లాట్ ఫామ్ అవుతుందని జియోహాట్‌స్టార్ సీఈఓ కిరణ్ మణి పేర్కొన్నారు.

జియోహాట్‌స్టార్ అందుబాటులోకి రావడంతో ఇక రూ.149 నుంచే సబ్‌‌‌ స్క్రిప్షన్ తీసుకునేందుకు అవకాశం ఉండనుంది. ప్రస్తుతం 3 లక్షల గంటల ఎంటర్‌టైన్మెంట్ , లైవ్ స్పోర్ట్స్ కవరేజీ, 50కోట్ల మందికి పైగా ఉన్న యూజర్లను జియోహాట్‌స్టార్‌ను మరింత అలరించనుంది. ప్రస్తుతం ఈ రెండు యాప్ యూజర్లు సింపుల్‌గా కొత్త సేవలు పొందవచ్చు. అంతేకాకుండా సులువుగా సబ్ స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

సబ్‌‌‌ స్క్రిప్షన్ ప్లాన్ విషయానికొస్తే.. మొబైల్ ప్లాన్‌లో.. 3 నెలలలకు రూ.149 ఉండగా, ఏడాదికి రూ.499గా నిర్ణయించారు. అలాగే సూపర్ ప్లాన్‌లో 3 నెలలకు రూ.299 ఉండగా, ఏడాదికి రూ.899… ప్రీమియం ప్లాన్‌లో3 నెలలకు రూ.499, ఏడాదికి రూ.1,499గా వెల్లడించారు.