Last Updated:

Naveen Reddy : సోషల్ మీడియా లో వైరల్ గా ఆదిభట్ల కిడ్నాపర్ ” నవీన్ రెడ్డి ” సెల్ఫీ వీడియో !

Naveen Reddy : సోషల్ మీడియా లో వైరల్ గా ఆదిభట్ల కిడ్నాపర్ ” నవీన్ రెడ్డి ” సెల్ఫీ వీడియో !

Naveen Reddy : ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ ఆదిభట్ల కిడ్నాప్ కేసు గురించి అందరికీ తెలిసిందే. తుర్కయంజాల్ మున్సిపల్ పరిధి మన్నేగూడ లోని సిరి టౌన్ షిప్ లో నివసిస్తున్న వైశాలిని ఆమె ఇంటి నుంచి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో ఆమె నివసిస్తున్న ఇల్లు పూర్తిగా ధ్వంసం చేసి ఆడొచ్చిన ఆమె కుటుంబ సభ్యులు, బంధువులపై కూడా దాడి చేశారు. ఈ కిడ్నాప్ ఉదంతంలో ప్రధాన నిందితుడు మిస్టర్ టి నిర్వాహకుడు నవీన్ రెడ్డిని ఎట్టకేలకు చిక్కాడు. గోవాలో నక్కిన నవీన్ రెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నవీన్ గోవాలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా ఇప్పుడు తాజాగా వైశాలి కిడ్నాప్ వ్యవహారంపై నవీన్ రెడ్డి సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. వైశాలిని ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది అనే దానిపై ఆ వీడియోలో చెప్పాడు. తాను చేసిందే తప్పే అని అంగీకరించిన నవీన్ వైశాలి కిడ్నాప్ వెనుక ఎంతో పెయిన్ ఉందని చెప్పుకొచ్చాడు. నవీన్ ఎం మాట్లాడాడు అంటే… అందరూ తనను నెగిటివ్ గా చూస్తున్నారు. అబ్బాయిదే తప్పు అంటున్నారు. నేను అడిగేది ఒక్కటే. నాకు జరిగినట్టే అమ్మాయికి జరిగి ఉంటే మీరు ఏం చేసేవాళ్లు. ఇంతే సైలెంట్ గా ఉండేవాళ్లా ? మీడియాలో నన్ను ఏ విధంగా అయితే బ్లేమ్ చేస్తున్నారో అదే అమ్మాయి అయి ఉంటే ఇలా జరిగి ఉండేదా? మీడియాకు నేను చేసే రిక్వెస్ట్ ఒక్కటే. ఈ ఇష్యూని ఒక అమ్మాయిది లేదా ఒక్క అబ్బాయిది అన్నట్లుగా కాకుండా ఇది ఒక ఫ్యామిలీది. ఒక మనసుకి సంబంధించినది అని వేలో చూడండి. కొంచెం పాజిటివ్ వే థింక్ చేయండి. దీన్ని పర్సనల్ గా, నెగిటివ్ గా చూడొద్దు’ అని అన్నాడు.

కాగా డిసెంబర్‌ 9న మధ్యాహ్నం 12 గంటల సమయంలో దాదాపు 40 మందితో కలిసి వైశాలి ఇంటికి వెళ్లిన నవీన్ వైశాలిని కిడ్నాప్‌ చేశాడు. వైశాలిని కిడ్నాప్‌ చేసి కారులో నల్గొండ వైపు తీసుకెళ్లాడు. అయితే తమ కోసం పోలీసులు వెతుకుతున్నారనే విషయం తెలిసి నవీన్‌ రెడ్డి, అతడి అనుచరులు ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేశారు. పోలీసులు గాలింపు ముమ్మరం చేసే సరికి నవీన్ రెడ్డి పరార్ అయ్యాడు. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాఫ్తు చేపట్టారు. నవీన్ రెడ్డితోపాటు ఏ-6 ఉన్న చందుని కూడా అరెస్ట్ చేశారు. అనంతరం కిడ్నాప్ తర్వాత నిందితులు ఎక్కడికి వెళ్లారు..? పరారీలో ఉన్న మిగతా నిందితుల వివరాలపై ఆరా తీస్తున్నారు.

ఇవి కూడా చదవండి: