Last Updated:

MLAs Purchase Case : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. నిందితులకు షరతులతో బెయిల్ మంజూరు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కుట్ర చేసిన కేసులో నిందితులకు తెలంగాణ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది.

MLAs Purchase Case :  టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..  నిందితులకు షరతులతో బెయిల్ మంజూరు

Telangana News: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కుట్ర చేసిన కేసులో నిందితులకు తెలంగాణ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. నిందితులు రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీ లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు వారికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకాలు చేయాలని, ముగ్గురి పాస్ పోర్టులను పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేయాలని, సిట్ విచారణకు పూర్తిగా సహకరించాలని షరతులు విధించిన కోర్టు ముగ్గురూ రూ. 2 లక్షల చొప్పున మొత్తం రూ. 6 లక్షల పూచీకత్తును సమర్పించాలని తెలిపింది.

వీరు బెయిల్ పై రిలీజ్ అయితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ లాయర్ చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. అయితే ఈ ముగ్గురు నిందితులకు బెయిల్ వచ్చినప్పటికీ సింహయాజీ మాత్రమే విడుదలవుతారు. మిగతా ఇద్దరు రామచంద్ర భారతి, నందకుమార్ లపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఇతర కేసులు ఉండటం వల్ల ఆ కేసుల్లో కూడా వారిద్దరికీ బెయిల్ వస్తేనే వారు జైలు నుండి విడుదలవుతారు.

మరోవైపు సిట్ ఈ కేసును పలు కోణాల్లో విచారణ  చేస్తోంది. బీఎల్ సంతోష్ ఇంకా సిట్ విచారణకు రాలేదు. ఆయన్ను ఎలాగైనా విచారించాలని భావిస్తోంది. ఆయన విచారణకు వస్తే కీలక విషయాలను రాబట్టవచ్చని అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ప్రత్యక్షంగా పట్టుబడిన నిందితులకు బెయిల్ రావటంతో  ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి: