AP Deputy CM Pawan Kalyan: కుమార్తె ఆద్యతో కలిసి దుర్గమ్మను దర్శించుకున్న పవన్‌కల్యాణ్
Pawan Kalyan visits Kanaka Durga temple: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనక దుర్గమ్మను ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ దర్శించుకున్నారు. కుమార్తె ఆద్య కొణిదెలతో కలిసి సరస్వతీ దేవిగా దర్శనం ఇస్తున్న దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు ఆలయ అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్ర పటం అందజేశారు. ఆయనతోపాటు హోం మంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.