Home / తాజా వార్తలు
BJP MP Etela Rajender Attack On Land Broker Grabbers: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై చేయి చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఏకశిలానగర్‌లో ఎంపీ ఈటల పర్యటించారు. ఈ మేరకు పేదలను ఇబ్బంది పెడుతున్న ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంపపై చెల్లుమనిపించాడు. అనంతరం బ్రోకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల భూములను కబ్జా చేస్తున్నారని, ఇంటి స్థలాల యజమానులను కూడా ఇబ్బందులకు గురిచేయడంపై […]
Private Album Shooting in Sri Kaleshwara mukteswara Temple: రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో అపచారం చోటుచేసుకుంది.ఏకంగా గర్భగుడిలో ప్రైవేట్ ఆల్బమ్ కోసం షూటింగ్ చేశారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంథని నియోజకవర్గంలోని ప్రముఖశైవక్షేత్రం కాళేశ్వరం ఆలయంలోని గర్భగుడిలో ప్రైవేటు సంస్థ నిర్మిస్తున్న ఓ సాంగ్‌ను చిత్రీకరణ చేసినట్లు భక్తులు తెలిపారు. అయితే దర్శనానికి వచ్చిన భక్తులను నిలిపివేసి ఆల్బమ్ షూటింగ్ […]
Kaleshwaram Project Commission Enquiry Today: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. విచారణకు బ్రేక్ ఇచ్చిన కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ చంద్ర ఘోష్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక మరింత వేగంగా కమిషన్ విచారణ సాగనుంది. నేటి నుంచి తిరిగి కమిషన్ విచారణ ప్రారంభంకానుంది. ఇప్పటికే విచారణపై ప్రాథమిక నివేదికను కమిషన్ సిద్ధం చేసింది. దాదాపు 208 పేజీలతో కమిషన్ నివేదికను […]
Best Mileage SUVs: భారతీయ మార్కెట్లో ఎస్‌యూవీల క్రేజ్ నిరంతరం పెరుగుతోంది. స్టైలిష్ లుక్, పవర్ ఫుల్ ఇంజన్, మంచి రోడ్ ప్రెజెన్స్ కారణంగా ప్రజలు హ్యాచ్‌బ్యాక్‌లకు బదులుగా సరసమైన ఎస్‌యూవీలను ఇష్టపడుతున్నారు. అయితే ఆకాశాన్నంటుతున్న డీజిల్, పెట్రోల్ ధరల కారణంగా ఎక్కువ మైలేజీతో వాహనాలు కొనాలని చాలా మంది భావిస్తున్నారు. మీరు కూడా భవిష్యత్తులో ఎస్‌యూవీని కొనాలని చూస్తున్నట్లయితే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కథనంలో దేశంలోనే అత్యధిక మైలేజీని అందించే ఎస్‌యూవీల […]
Ayodhya awakened the race: ‘నేను బతికుండగా ఆ దృశ్యాన్ని చూడగలనా?’ అని కోట్లాది మంది హిందువులు 500 ఏళ్ల పాటు మథనపడిన ఆ ఘట్టం నిరుటి జనవరి 22న అయోధ్యలో సాకారమైంది. నిరుటి పుష్య శుక్ల ద్వాదశి తిథి నాడు సకల రాజలాంఛనాలతో బాలరాముడి ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. దీర్ఘకాలం పాటు ఒక చిన్న టెంటులో అనామకంగా ఉంటూ పూజలందుకున్న బాలరాముడు.. అత్యంత సుందరమైన మందిరంలో సకల రాజోపచారాలతో కొలువైన నాటి బాల […]
Horoscope Today in Telugu: మొత్తం 12 రాశులు. ఇవాళ ఏ రాశి వారికి ఎలా ఉంది? ఎలాంటి పనులు చేయాలి? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – మీ ప్రయోజనాలు పదిలంగా ఉంటాయి. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా ఉంటాయి. గోప్యంగా కొన్ని పనులు చేపట్టి వాటిని అభివృద్ధి పథంలో నడిపించడానికి సమాయత్తమవుతారు. వృషభం – ఆర్థికంగా బాగుంటుంది. కొన్ని విషయాలలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి పరంగా […]
Rishabh Pant named captain of Lucknow Super Giants: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా టీమిండియా యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ నియామకమయ్యారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో లక్నో మేనేజ్మెంట్ పంత్‌ను రూ.27కోట్లకు భారీ మొత్తంలో రికార్డు ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే అందరూ ఊహించన విధంగానే పంత్‌కే కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. లక్నోకు తొలి టైటిల్ ఇచ్చేందుకు 200 శాతం కృషి చేస్తానని చెప్పాడు. కొత్త ఉత్సాహంతో […]
Maoists Encounter in Chhattisgarh twelve Naxalites killed: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గరియాబంద్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో 12మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మృతి చెందిన 12 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు గరియాబంద్ ఎస్పీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దులో గత కొంతకాలంగా భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే గరియాబంద్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న […]
AP Government Transferred 27 IPS Officers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 27 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదీ జాబితా.. సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ప్రకారం.. ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్‌గా రాజీవ్ కుమార్ మీనాను నియమించారు. శాంతిభద్రతల అదనపు డీజీగా ఎన్ మధుసూదన్‌రెడ్డిని బదిలీ చేసింది. […]
Income Tax raids on producer Dil Raju’s properties in Hyderabad: ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు దిల్ రాజు ఇళ్లతో పాటు పలు కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. కాగా, ప్రస్తుతం దిల్ రాజు తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, హైదరాబాద్‌లో 8 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే టాలీవుడ్ నిర్మాత, ఎఫ్డీసీ ఛైర్మన్ […]