Home / తాజా వార్తలు
Telangana Assembly Session 2024: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి నేటికీ ఏడాది కావొస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తుంది. ఈ తరుణంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సమావేశాల్లోనే ప్రధానంగా కొత్త రెవెన్యూ చట్టం, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, థర్మల్ పవర్ ప్లాంటుపై న్యాయ విచారణ కమిషన్ ఇచ్చిన నివేదిక, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాలను చర్చకు […]
Heavy rain forecast for AP Storm in the Bay of Bengal: ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు పొంచి ఉంది. హిందూ మహా సముద్రంతో పాటు దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరోసారి ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఆదివారం మధ్యాహ్నానికి ఇది తీవ్ర అల్పపీడనంగా మారి ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 12వ తేదీలోపు తమిళనాడు, శ్రీలంక తీరాలకు చేరువవుతుందని […]
Former Minister Mekathoti Sucharitha Big shock to YSRCP: వైసీపీకి మరో షాక్. ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి, వైసీపీ సీనియర్ నేత మేకతోటి సుచరిత ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీని వీడి, జనసేనలోకి చేరగా, ఆ పొరుగు జిల్లాకు చెందిన నేత సుచరిత నేడో, రేపో ఆ పార్టీకి వీడ్కోలు ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. విధేయ నేతగా గుర్తింపు.. […]
Southern Railway announces Sabarimala Special Trains: శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. భక్తుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. తాజాగా జనవరిలో ప్రత్యేకంగా 34 అదనపు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. హైదరాబాద్ – కొట్టాయం; కొట్టాయం – సికింద్రాబాద్; మౌలాలి – కొట్టాయం; కాచిగూడ – కొట్టాయం; మౌలాలి – కొల్లం మధ్య జనవరి 3 […]
ICQC Aviation Safety International Standards: భారత విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో విమానయాన భద్రతను కల్పించేందుకు క్వాలిటీ కంట్రోల్ యూనిట్‌ను (ఐక్యూసీయూ) ప్రారంభించినట్లు సీఐఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ (ఐఎన్టీ) దీపక్ వర్మ ఆదివారం తెలిపారు. ఐక్యూసీయూ ఏర్పాటు చేసి, దేశంలోని 68 విమానాశ్రయాల్లో విమానయాన భద్రతా దళం (ఏఎస్జీ) అందించే భద్రతను మెరుగుపర్చేందుకు సీఐఎస్ఎఫ్ దళం కీలకమైన ముందడుగు వేసిందన్నారు. ప్రపంచస్థాయి భద్రతా విధానాలు, సాంకేతికతలను రూపొందించడంలో ఐక్యూసీయూ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ […]
Pushp 2: The Rule Hindi Collection: అల్లు అర్జున్ పుష్ప 2 రికార్డులు తిరగరాస్తుంది. సునామీ వసూళ్లతో బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో ఈ సినిమా తుఫానులా చెలరేగిపోతుంది. కాగా పుష్ప పార్ట్ వన్‌తో అల్లు అర్జున్ నార్త్ మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో తనదైన స్టైల్, మాస్ ఇమేజ్ అక్కడ విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. నార్త్‌లో అతడి క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ట్రైలర్ ఈవెంట్‌కి వచ్చని రెస్పాన్స్ […]
Pushpa 2 Tickets Rates Reduced: బాక్సాఫీసు వద్ద అల్లు అర్జున్ ‘పుష్ప 2’ దూకూడు మామూలుగా లేదు. భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం అంతకుమించి రెస్పాన్స్ అందుకుంది. ప్రీమియర్స్‌తోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వసూళ్లతో విధ్వంసం సృష్టిస్తుంది. మూడు రోజుల్లో రూ. 600పైగా కోట్ల గ్రాస్ రాబట్టిన ఫాస్టెస్ట్ ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ రోజు ఆదివారం వీకెండ్ కావడంతో పుష్ప 2 థియేటర్లో హౌజ్‌ఫుల్ […]
Naga Chaitanya and Sobhita Wedding Photos: నాగ చైతన్య-శోభిత దూళిపాళ పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో డిసెంబర్ 4న వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు కొద్దిమంది బంధుమిత్రులు, ఇండస్ట్రీ ప్రముఖులు సమక్షంలో చై-శోభితలు ఏడడుగులు వేశారు. అయితే వీరి పెళ్లయి నాలుగు రోజులు అయ్యింది కానీ ఇంతవరకు పెళ్లి ఫోటోలను ఈ జంట షేర్ చేయలేదు. అయితే తాజాగా ఈ కొత్త జంట పెళ్లి […]
Mohan Babu Tweet Viral: ప్రస్తుతం మంచు ఫ్యామిలీకి ఆస్తి వివాదాలని, తండ్రికొడుకుల(మోహన్ బాబు- మనోజ్) మధ్య ఘర్షణలు జరిగాయంటూ ఓ వార్త ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆస్తి విషయంలో మనోజ్, మోహన్ బాబుకి మధ్య గొడవ జరిగిందని, తన తండ్రి దాడి చేశాడంటూ మనోజ్ పోలీసులను ఆశ్రయించినట్టు ఈ రోజు ఉదయం ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియదు. కానీ మంచు మోహన్ బాబు పీఆర్ టీం ఈ వార్తలను […]
Manchu Manoj Joins in Hospital Video Viral: హీరో మంచు మనోజ్ ఆస్పత్రిలో చేరాడు. కాగా ఆదివారం ఉదయం నుంచి మంచు ఫ్యామిలీలో ఆస్తి వివాదాలు అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తన తండ్రి తనని కొట్టాడంటూ మనోజ్ రాచకొండ పోలీసులను ఆశ్రయించినట్టు సమాచారం. దీంతో మోహన్ బాబు మనోజ్ తనపై దాడి చేశాడంటూ ఆరోపించినట్టు తెలుస్తోంది. వీరిద్దరు పరస్పర ఆరోపణలతో పోలీసు స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే […]