Home / తాజా వార్తలు
రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన లడ్కి సినిమాను నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.. పూజా భలేకర్ మెయిన్ లీడ్ పోషించిన ఈ సినిమాను వెంటనే నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. ఈ విషయమై నిర్మాత కె. శేఖర్ రాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఈ నోటీసులు
ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించారు సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజాకార్యక్రమంలో పాల్గొని డ్రెడ్జింగ్ పనుల్నిప్రారంభించారు. అనంతరం రామాయపట్నం పోర్టు పైలాన్‌ను ఆవిష్కరించారు.
ఇటీవల గోదావరికి భారీగా వరద నీరు రావడంతో పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 40. 5 మీటర్లు ఉన్న కాపర్ డ్యాంను 43.5 మీటర్లకు పెంచాలని నిర్ణయించింది. అనుకున్నదే ఆలస్యం. చకచకా పనులు ప్రారంభించి, రెండు రోజుల్లోని పూర్తి చేసింది ఏపీ సర్కార్.
మెగాస్టార్ చిరంజీవిపై సీపీఐ నారాయణ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సీపీఐ నారాయణ కామెంట్ల పై నాగబాబు ట్విట్టర్ లో విమర్శించడంతో, అది మరికాస్త పెరిగింది. దాంతో చిరంజీవిపై చేసిన కామెంట్లపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఆయన పై చేసిన వ్యాఖ్యలను వెనుక్కు తీసుకుంటున్నానని తెలిపారు.
తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. వైసిపి దొంగ ఓట్లు వేయిస్తోందంటూ టీడీపీ ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. దీనితో టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దొంగ ఓట్లు వేసే వారిని పట్టుకున్నా
తన సోదరులు చిరంజీవి, పవన్ కల్యాణ్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణ పై మెగాబ్రదర్ నాగబాబు ధ్వజమెత్తారు. ఇటీవల కాలంలో కొంతమంది చేసిన తెలివి తక్కువ వెర్రి వ్యాఖ్యలపై మెగా అభిమానులు, జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు.
తెలంగాణలో వాయిదా పడ్డ ఎంసెట్ పరీక్షలను రీషెడ్యూల్ చేశారు. ఉన్నత విద్యామండలి పరీక్షా తేదీలను ప్రకటించింది. ఈనెల 30, 31 తేదీల్లో ఎంసెట్ (అగ్రికల్చర్) పరీక్షలు, ఆగస్ట్ 1న ఈ-సెట్, ఆగస్ట్ 2 నుంచి 5 వరకు పీజీ ఈ-సెట్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. భారీ వర్షాలు కారణంగా ఈ నెల 13, 14, 15 తేదీల్లో జరగాల్సిన టీఎస్ ఎంసెట్ అగ్రికల్చర్, ఈసెట్
దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించినప్పటి నుండి, ఈ చిత్రానికి అంతర్జాతీయ ప్రేక్షకుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది హాలీవుడ్ దర్శకులు, విమర్శకులు మరియు రచయితలు ఈ చిత్రాన్ని కొనియాడారు
శ్రీలంకలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో ముఖ్యంగా మహిళల పరిస్థితి దారుణంగా తయారైంది. టెక్స్టైల్ పరిశ్రమలు మూతపడ్డంతో ఈ పరిశ్రమల్లో పనిచేసే మహిళలు విధిలేని పరిస్థితుల్లో ఆహారం, మందులు, కుటుంబ పోషణ కోసం వేశ్య వృత్తిలోకి దిగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇతర ఉద్యోగాలు చేయడానికి నైపుణ్యం లేని కారణంగా పడుపు వృత్తిలో దిగాల్సి వస్తోందని
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎకనామిక్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ (ERD) ప్రకారం, రైతుల ఆదాయం కొన్ని రాష్ట్రాల్లో (కర్ణాటకలో పత్తి మరియు మహారాష్ట్రలో సోయాబీన్ వంటివి) 1.3–1.7 రెట్లు పెరిగింది మరియు 2018తో పోలిస్తే 20222లో కొన్ని పంటల ఆదాయం రెండు రెట్లు పెరిగింది.