Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు షాక్.. లడ్కి సినినిమాను నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు
రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన లడ్కి సినిమాను నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.. పూజా భలేకర్ మెయిన్ లీడ్ పోషించిన ఈ సినిమాను వెంటనే నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. ఈ విషయమై నిర్మాత కె. శేఖర్ రాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఈ నోటీసులు

Tollywood: రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన లడ్కి సినిమాను నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూజా భలేకర్ మెయిన్ లీడ్ పోషించిన ఈ సినిమాను వెంటనే నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. ఈ విషయమై నిర్మాత కె. శేఖర్ రాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఈ నోటీసులు పంపించింది.
వర్మ తన దగ్గర కొన్ని దఫాలుగా లక్షలాది రూపాయలు తీసుకున్నారని శేఖర్ రాజు ఆరోపించారు. ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా ఎప్పటికప్పుడు దాటవేస్తూ వర్మ తప్పించుకుంటూ తిరుగుతున్నారని నిర్మాత శేఖర్ రాజు చెప్పారు. అయితే ఇదే కేసులో రామ్ గోపాల్ వర్మ పంజాగుట్ట పీఎస్ లో రిటర్న్ కంప్లెయింట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మరికాసేట్లోనే పీఎస్ కు వెళ్లి వర్మ ఫిర్యాదు చేస్తారని ఆయన సన్నిహితులు వెల్లడించారు.