Last Updated:

Nandamuri Taraka Ratna : యువగళానికి బ్రేక్ ఇచ్చిన లోకేష్.. బావ అని పిలిచే గొంతు ఇక లేదంటూ ఎమోషనల్

నందమూరి తారకరత్న పార్ధివ దేహానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రహ్మణి నివాళుల్పించారు. తారకరత్న మృతితో తన యువగళం పాదయాత్రకు మూడు రోజుల పాటు తాత్కాలిక విరామం ప్రకటించిన నారా లోకేష్..

Nandamuri Taraka Ratna : యువగళానికి బ్రేక్ ఇచ్చిన లోకేష్.. బావ అని పిలిచే గొంతు ఇక లేదంటూ ఎమోషనల్

Nandamuri Taraka Ratna : నందమూరి తారకరత్న పార్ధివ దేహానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రహ్మణి నివాళుల్పించారు. తారకరత్న మృతితో తన యువగళం పాదయాత్రకు మూడు రోజుల పాటు తాత్కాలిక విరామం ప్రకటించిన నారా లోకేష్.. వెంటనే బయలు దేరి హైదరాబాద్ లోని తారకరత్న నివాసానికి చేరుకున్నారు. తారకరత్న భౌతిక కాయానికి నివాళులర్పించడంతో పాటు.. చిత్రపటం వద్ద పుష్పాలను ఉంచి అంజలి ఘటించారు. అంత్యక్రియకలు పూర్తయ్యే వరకూ లోకేష్ హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. నారా లోకేష్ వెంట బ్రహ్మణి కూడా ఉన్నారు. అనంతరం తారకరత్న కుటుంబ సభ్యులను నారా లోకేష్ దంపతులు పరామర్శించారు.

నీ (Nandamuri Taraka Ratna) ప్రేమ‌, స్నేహ బంధం మ‌న బంధుత్వం కంటే గొప్ప‌ది – నారా లోకేష్

ఇక, తారకరత్న మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని లోకేష్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక తనకు వినిపించదని ఆవేదన వ్యక్తం చేశారు. తారకరత్న మృతి తమ కుటుంబానికి, టీడీపీకి తీరని లోటని అన్నారు. ‘‘బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించ‌దు. నేనున్నానంటూ నా వెంట న‌డిచిన ఆ అడుగుల చ‌ప్పుడు ఆగిపోయింది. నంద‌మూరి తార‌క‌ర‌త్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువ‌తేజం తార‌క‌ర‌త్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీర‌ని లోటు. నిష్క‌ల్మ‌ష‌మైన నీ ప్రేమ‌, స్నేహ బంధం మ‌న బంధుత్వం కంటే గొప్ప‌ది. తార‌క‌ర‌త్న‌కి క‌న్నీటి నివాళి అర్పిస్తూ, తారకరత్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను’’ అని లోకేష్ పేర్కొన్నారు.

 

 

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర‌ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన తారకరత్న గుండెపోటుతో స్పృహ కోల్పోయారు. దీంతో ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ముందుగా కుప్పం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తారకరత్నను నారా లోకేష్ పరామర్శించారు. అనంతరం అదే రోజు రాత్రి మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదలయా ఆస్పత్రికి తరలించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని గురించి నందమూరి బాలకృష్ణతో ఎప్పటికప్పుడూ నారా లోకేష్ పర్యవేక్షిస్తూనే వచ్చారు. అయితే వైద్యులు తారక రత్నను బతికించడానికి ఎంతగానో ప్రయత్నించారు. హాస్పిటల్లో చేరినప్పటి నుంచి ఆయన పరిస్థితి క్రిటికల్ గానే వుండటంతో ఐసియూలోనే ఉంచి చికిత్స అందించారు. విదేశాల నుంచి ప్రత్యేక వైద్య బృందాలను తీసుకువచ్చి మెరుగైన చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. తారకరత్న తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో నందమూరి, నారా కుటుంబ సభ్యులు, తెలుగు రాష్ట్రాల ప్రజలు విషాదంలో మునిగిపోయారు.

 

నేడు (ఆదివారం) ఇంటి వద్దే ప్రముఖుల సందర్శనార్థం తారకరత్న పార్థివదేహాన్ని ఉంచుతారు. సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో అభిమానులు, ప్రజల సందర్శనార్థం తారకరత్న భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. అనంతరం తారకరత్న అంత్యక్రియలు ఫిలింనగర్ లోని మహా ప్రస్థానంలో జరగనున్నాయి. తారకరత్నకు ఆయన తండ్రి మోహనకృష్ణ చేతుల మీదుగా అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/