APPSC: గ్రూప్ 1 మెయిన్స్.. మే 3 నుంచి మే 9 వరకు షెడ్యూల్ ఇదే!
APPSC Group 1 Mains 2025 Exam Dates Schedule Released: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 3 నుంచి 9 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరపనున్నట్లు మంగళవారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. ఈ పరీక్షలను డిస్క్రిప్టివ్ టైప్‌లో నిర్వహిస్తామని, వీటి ప్రశ్నాపత్రాలను ట్యాబ్‌లలో ఇస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి స్పష్టం చేశారు. ఈ పరీక్షలు ఆయా తేదీలలో ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు జరుగుతాయని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.
ఏడు పరీక్షలు
ఏపీలో మొత్తం 81 గ్రూప్ -1 పోస్టుల భర్తీకి 2024 మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 1,48,881మంది ప్రిలిమ్స్‌కు దరఖాస్తు చేసుకోగా.. ఆ ఫలితాలు ఏప్రిల్ 12న విడుదలయ్యాయి. ఈ పరీక్షలో మొత్తం 4,496మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. కాగా, వీరంతా మొత్తం 7 పరీక్షలు రాయనున్నారు. వీటిలో తొలి రెండు పరీక్షలు అర్హతకు సంబంధించినవి కాగా, మిగిలిన 5 పేపర్లు మెరిట్‌కు సంబంధించినవి.
పరీక్షల క్రమం..
మే 3 : అర్హత పరీక్ష (తెలుగు)
మే 4: అర్హత పరీక్ష(ఇంగ్లీష్)
మే 5: పేపర్ 1(జనరల్ ఎస్సే)
మే 6: పేపర్ 2(చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ)
మే 7: పేపర్ 3( పాలిటీ)
మే 8: పేపర్ 4 (ఎకానమి)
మే 9: పేపర్ 5(సైన్స్ అండ్ టెక్నాలజీ), ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్)