Last Updated:

Sravana Bhargavi: వివాదంలో సింగర్ శ్రావణ భార్గవి.. ఒకపరి కొకపరి వయ్యారమయ్యే కీర్తన పై తప్పు బట్టిన అన్నమయ్య వంశస్దులు

సింగర్ శ్రావణ భార్గవి వివాదంలో చిక్కుకున్నారు. ఒకపరి కొకపరి వయ్యారమై అనే అన్నమయ్య కీర్తనపై చేసిన వీడియో వివాదస్పదమవుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి పై అన్నమయ్య రచించిన కీర్తనను అసభ్యకర భంగిమలతో వీడియో షూట్ చేయడాన్ని అన్నమయ్య వంశస్థులు హరి నారాయణ ఆచార్యులు తప్పు పట్టారు. కలియుగ దైవం వేంకటేశ్వరునిపై

Sravana Bhargavi: వివాదంలో సింగర్ శ్రావణ భార్గవి.. ఒకపరి కొకపరి వయ్యారమయ్యే కీర్తన పై తప్పు బట్టిన అన్నమయ్య వంశస్దులు

Tollywood: సింగర్ శ్రావణ భార్గవి వివాదంలో చిక్కుకున్నారు. ఒకపరి కొకపరి వయ్యారమై అనే అన్నమయ్య కీర్తనపై చేసిన వీడియో వివాదస్పదమవుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి పై అన్నమయ్య రచించిన కీర్తనను అసభ్యకర భంగిమలతో వీడియో షూట్ చేయడాన్ని అన్నమయ్య వంశస్థులు హరి నారాయణ ఆచార్యులు తప్పు పట్టారు. కలియుగ దైవం వేంకటేశ్వరుని పై అనన్య భక్తితో అన్నమయ్య కీర్తలను శృంగార భంగిమలలో నటిస్తూ చిత్రీకరించడం శ్రీవారిని అవమానించినట్లేనని అభిప్రాయపడ్డారు. శ్రీవారి పట్ల అన్నమయ్యకున్న భక్తి వెలకట్టలేనిదని హరి నారాయణ ఆచార్యులు తెలిపారు. శ్రావణ భార్గవి శ్రీవారి అభిషేక సమయంలో ఆలపించే మనోహరమైన అన్నమయ్య కీర్తనను శ్రావణ భార్గవి అసభ్యంగా చిత్రీకరించడం క్షమార్హం కాదని అభిప్రాయపడ్డారు. శ్రావణ భార్గవి వీడియోను సామాజిక మాధ్యమాలనుంచి తొలగించాలని అన్నమయ్య వంశస్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

అయితే శ్రావణ భార్గవి కూర్చొని ఆలపించకుండా పడుకుని కన్యాశుల్కం పుస్తకం చదువుతూ శ‌ృంగార భంగిమలతో వీడియో షూట్ చేయడం పట్ల అన్నమయ్య వంశస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ముందు అన్నమయ్య కీర్తనలు అసభ్యకరంగా ఎవరూ చిత్రీకరించకుండా చర్యలు తీసుకునేలా శ్రావణ భార్గవి పై టీటీడీతో చర్చించి అవసరమైతే కోర్టుకెళ్తామని హరి నారాయణ ఆచార్యులు హెచ్చరించారు.

తాళ్లపాక అన్నమాచార్యులు 15 వ శతాబ్ధానికి చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని కీర్తిస్తూ కొన్ని వేల సంకీర్తనలను రూపొందించారు. సుమారు 32వేల సంకీర్తనలకు సంగీతాన్ని సమకూర్చి, అన్నమాచార్యులు స్వర పరచి పాడిన సంకీర్తనలను రాగి రేకులపై రచించి తిరుమల సంకీర్తనా భాండాగారంలో భద్రపరిచారు.

ఇవి కూడా చదవండి: