Last Updated:

US Mid term elections: అమెరికాలో రేపు మధ్యంతర ఎన్నికలు

అమెరికాలో మధ్యంతర ఎన్నికల హడావిడి చివరి దశకు చేరుకుంది. మెరిన్‌ పౌరులు రేపు 435 మంది హౌజ్‌ ప్రతినిధులను ఎన్నుకోవడంతో పాటు 100 సీట్లు కలిగిన సెనెట్‌లో 35 మందిని ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం జో బైడెన్‌ భవితవ్యాన్ని తేల్చబోతోంది.

US Mid term elections: అమెరికాలో రేపు మధ్యంతర ఎన్నికలు

Washington: అమెరికాలో మధ్యంతర ఎన్నికల హడావిడి చివరి దశకు చేరుకుంది. అమెరిన్‌ పౌరులు రేపు 435 మంది హౌజ్‌ ప్రతినిధులను ఎన్నుకోవడంతో పాటు 100 సీట్లు కలిగిన సెనెట్‌లో 35 మందిని ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం జో బైడెన్‌ భవితవ్యాన్ని తేల్చబోతోంది. అమెరికా ప్రెసిడెంట్‌ నాలుగేళ్ల పదవి కాలం సగం పూర్తయిన తర్వాత జరిగే ఎన్నికలు కాబట్టి దీన్ని మిడ్‌ టర్మ్‌ ఎలక్షన్‌ అని అంటారు. కాగా బైడెన్‌ అధికారంలో ఉండేది ఇంకా రెండేళ్లు మాత్రమే. కాగా సెనెట్‌ విషయానికి వస్తే రిపబ్లికన్స్‌కు.. డెమోక్రాట్‌ అభ్యర్థులకు ఓటర్లలో చేరి సమానంగా మద్దతు ఉంది. అయితే ఇటీవల జరిగిన పోల్స్‌ను బట్టి చూస్తే హౌస్‌లో రిపబ్లికన్లు పట్టు సాధించే అవకాశం కనిపిస్తోంది. కాగా 2018 ఎన్నికల్లో డెమోక్రాట్ల చేతిలో రిపబ్లికన్లు ఓడిపోయారు.

తాజా 538 అనే సంస్థ నిర్వహించిన ఒపినీయన్‌ పోల్స్‌ అంచనా ప్రకారం హౌజ్‌లో 80 శాతం రిపబ్లికన్లు దక్కించుకునే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. అంటే 215 నుంచి 248 సీట్లను రిపబ్లికన్లు కైవసం చేసుకుంటుందని తెలిపింది. అమెరికా ఎలక్టోరల్‌ కాలేజీ నుంచి రాష్ర్టాల నుంచి ఖచ్చితమైన సమాచారం తెలుసుకొని ఒపినీయన్‌ పోల్‌ ఫలితాలను ప్రకటించినట్లు వెల్లడించింది. అయితే పోటీ మాత్రం ఐయోవా థర్డ్‌ డిస్ర్టిక్‌, నార్త్‌ కరోలినా 13th డిస్ట్రిక్ట్ , కొలోరాడో 8th డిస్ట్రిక్ట్ తో పాటు టెక్సాస్‌ – మెక్సికో సరిహద్దుకు చెందిన మూడు జిల్లాలు కీలకం కానున్నాయని తెలిపింది. ఇక సెనెట్‌ విషయానికి వస్తే జార్జియా, నెవాడా, పెన్సిల్వేనియాలపై అత్యధికంగా ఫోకస్‌ కనిపిస్తోంది. జార్జియా, నెవాడా స్థానాలు రిపబ్లికన్‌లు దక్కించుకొనే అవకాశాలు కనిపిస్తుండగా, పెన్సిల్వేనియా స్థానం డెమోక్రాట్‌లకు దక్కే చాన్స్‌ కనిపిస్తోందని ఒపినియన్‌ పోల్స్‌ తేటతెల్లం చేస్తున్నాయి.

ఒక వేళ సెనెట్‌ డెమోక్రాటిక్‌ల పరం అయితే, హౌజ్‌ మాత్రం రిపబ్లికన్‌ల పరం అవుతుంది. అలాంటి సమయంలో వచ్చే రెండేళ్ల పాటు చట్టాలు ఆమోదం పొందడం కష్టం అవుతుంది. హౌజ్‌లో ఆమోదం పొందిన బిల్లులు సెనెట్‌లో తిరస్కరణకు గురవుతాయి. మొత్తానికి హౌజ్‌లో రిపబ్లికన్లకు పట్టులభిస్తుందనే ఒపినియన్‌ పోల్స్‌ చెబుతున్నాయి. అయితే చట్టాలు ఆమోదించుకోవడంతో నిధుల కేటాయింపులు వ్యయంపై అడ్డంకులు సృష్టించవచ్చు. దీంతో డెమోక్రాటిక్‌లు బేరసారాలకు దిగి రావాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి: