Home / అంతర్జాతీయం
కంబోడియా కు చెందిన ఒక వ్యక్తిని 40 మొసళ్లు చంపాయని పోలీసులు తెలిపారు. లువాన్ నామ్, (72),తమ కుటుంబానికి చెందిన మొసళ్ల ఫాంలో గుడ్లు పెట్టిన బోనులోంచి మొసలిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తుండగా, అతను గోడ్‌గా ఉపయోగిస్తున్న కర్రను పట్టుకుని మొసలి లోపలికి లాగింది. దీనితో అతను పట్టు తప్పి లోపలకు పడిపోయాడు.
దక్షిణ కొరియాలో ఏషియానా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమాన డోర్‌ను ఓ ప్యాసింజెర్ తెరిచాడు. దీనితో విమానం లోపల భారీ గాలి ప్రకంపనలు వచ్చాయి. ఆ సమయంలో విమానంలో 194 మంది ప్రయాణికులు ఉన్నారు. సిబ్బంది విమానాన్ని డేగూ విమానాశ్రయంలో దించారు.
ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి ముప్పు పోయిందనుకుంటున్న నేపథ్యంలో చైనాలో మరోసారి కరోనా విజృభిస్తోంది. కొత్త వేరియంట్ తో చైనాలో గత కొన్ని రోజులుగా విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి.
పాకిస్థాన్ మాజీ ముఖ్యమంత్రి ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీ, ఆయన పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ)కి చెందిన మరో 80 మంది సభ్యులను నో ఫ్లై లిస్ట్‌లో చేర్చినట్లు సంబంధిత వర్గాలు గురువారం తెలిపాయి. వీరు వాణిజ్య విమానంలో ప్రయాణించకుండా నిషేధించబడతారు. భద్రతాపరమైన ప్రమాదంగా పరిగణించబడతారు.
18వ శతాబ్దపు మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ బెడ్‌చాంబర్ ఖడ్గం లండన్‌లోని బోన్హామ్స్ ఇస్లామిక్ అండ్ ఇండియన్ ఆర్ట్ సేల్ అనే వేలం హౌస్‌లో 14 మిలియన్ పౌండ్లకు ($17.4 మిలియన్లు లేదా రూ. 143 కోట్లు) విక్రయించబడింది. భారతీయ వస్తువుకు వేలంలో ఇది కొత్త ప్రపంచ రికార్డు.
ప్రఖ్యాత ఆర్థికవేత్త స్టీవ్ హాంకే యొక్క వార్షిక మిజరీ ఇండెక్స్ (HAMI) ప్రకారం జింబాబ్వే అత్యంత దయనీయమైన దేశంగా ఉద్భవించింది, ఇది ప్రధానంగా ఆర్థిక పరిస్థితులపై దేశాలను అంచనా వేస్తుంది.
ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ కంపెనీ ఎల్వీఎంహెచ్ కంపెనీ లగ్జరీ ప్రొడక్టులను తయారు చేస్తుంది. ఈ కంపెనీ వివిధ బ్రాండ్లతో కాస్ట్ లీ హ్యాండ్‌బ్యాగ్స్, షాంపులు, ఖరీదైన గౌన్లతో సహా మరెన్నో వస్తువులను తయారు చేస్తుంది.
యూకే ప్రభుత్వం మంగళవారం భారతీయులతో సహా విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని కొత్త ఇమ్మిగ్రేషన్ విధానాన్ని ప్రకటించింది. హౌస్ ఆఫ్ కామన్స్‌కి వ్రాతపూర్వక ప్రకటనలో యూకే హోమ్ సెక్రటరీ సుయెల్లా బ్రేవర్మాన్ మాట్లాడుతూ, ప్రస్తుతం పరిశోధన ప్రోగ్రామ్‌లుగా నియమించబడిన పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులలోని అంతర్జాతీయ విద్యార్థులు మాత్రమే పిల్లలు మరియు వృద్ధ తల్లిదండ్రులతో సహా వారి కుటుంబ సభ్యులను వారిపై ఆధారపడిన వారిగా తీసుకురావడానికి అనుమతించబడతారని తెలిపారు.
ఈ ఏడాది చివరిలో భారత్ లో జరిగే క్రికెట్ వరల్డ్ కప్ మరియు దీపావళి వేడుకలను వీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మరియు ఆస్ట్రేలియా అభిమానులను ఆహ్వానించారు. అక్టోబర్-నవంబర్‌లో భారత్‌లో క్రికెట్ ప్రపంచకప్ జరగాల్సి ఉంది. ఈ ఏడాది నవంబర్ 12న దీపావళి జరుపుకోనున్నారు.
Joe Biden: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వద్ద ట్రక్కుతో ఓ యువకుడు బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో తెలుగు సంతతి 19 ఏళ్ల యువకుడు కందుల సాయి వర్షిత్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.