Home / అంతర్జాతీయం
Bomb Threat: గత కొన్ని రోజులుగా బాంబు బెదిరింపులు రావడంతో వివిధ భారతీయ విమానయాన సంస్థల విమానాలు అత్యవసరంగా ల్యాండ్ అవుతున్నాయి. అదే క్రమంలో శనివారం కూడా కొన్ని విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సమాచారం ప్రకారం వివిధ ఏవియేషన్ కంపెనీలకు చెందిన 20కి పైగా విమానాలకు శనివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎయిరిండియా, ఇండిగో, అకాస ఎయిర్, విస్తారా, స్పైస్‌జెట్, స్టార్ ఎయిర్, అలయన్స్ ఎయిర్ విమానాలకు ఈ బెదిరింపులు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. […]
Israel offers update Hamas chief Yahya Sinwar dead: హమాస్‌తో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ మరోసారి విజయం సాధించింది. హమాస్‌పై చేసిన దాడిలో ఆ దేశ కొత్త చీఫ్ యాహ్య సిన్వార్ హతమైనట్లు తెలుస్తోంది. తాజాగా, హమాస్‌ను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో యాహ్య సిన్వర్‌ను హతమార్చినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. గాజాలోని స్ట్రిప్ అనే ప్రాంతంపై గురువారం ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో ముగ్గురు ఉగ్రవాదులను ఆ దేశ […]
Canada–India relations: కెనడాలో సిక్కుల టార్గెట్ కిల్లింగ్ వెనుక కేంద్రహోంమంత్రి అమిత్ షా.. ఇండియా ఇంటెలిజెన్స్ సంస్థ రా సీనియర్ అధికారుల హస్తం ఉందా? ప్రస్తుతం ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలు పాతాళానికి పడిపోవడానికి కారణం అమిత్ షానేనా? అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ మాత్రం కెనడాలో ఖలిస్తానీ టెర్రరిస్టులను చంపడానికి కేంద్రమంత్రే కారణమంటూ ఓ కథనాన్ని ప్రచురించింది. వివరాలేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. కెనడాకు.. ఇండియాకు మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వచ్చాయి […]
Air India Bomb Threat: న్యూఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో మంగళవారం కెనడాలోని విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. దీంతో పాటు గంట వ్యవధిలోనే దేశంలోని మొత్తం నాలుగు విమానాలకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. బాంబు బెదిరింపు రావడంతో విమానాలను సమీపంలోని విమానాశ్రయంలో దించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎయిరిండియాతో పాటు స్పైస్‌జెట్, ఇండిగో, అకాస విమానాలకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. విమానాలను బెదిరించే వారి ఆచూకీ కోసం […]
Coca Cola: మీరు కోకాకోలా, పెప్సీ పేర్లను విని ఉంటారు. రెండూ ఒకదానికొకటి ప్రత్యర్థి కంపెనీలు. అయితే దీనికి సంబంధించి ఓ పెద్ద వార్త బయటకు వచ్చింది. కోకా-కోలా కార్యదర్శి కంపెనీ వ్యాపార రహస్యాలను విక్రయించడానికి ప్రయత్నించారు. కోకాకోలా గ్లోబల్ హెడ్‌క్వార్టర్స్ నుండి 41 ఏళ్ల సెక్రటరీ జోయా విలియమ్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జోయా, ఇబ్రహీం డిమ్సన్, ఎడ్మండ్ దుహానీలతో కలిసి కోకా-కోలా కంపెనీ రహస్య సమాచారాన్ని లీక్ చేయడానికి ప్రయత్నించారు. అతను ఈ సమాచారాన్ని […]
Nobel Peace Prize 2024 Awarded to Japan: ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించారు. 2024 ఏడాదికి గానూ జపాన్‌కు చెందిన నిహాన్ హిడాంక్యో సంస్థకు వరించింది. అణ్వాయుధాల రహిత ప్రపంచం కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఈ మేరకు స్టాక్ఘోంలో ఉన్న కరోలిన్ స్కా ఇన్స్టిట్యూట్లోని నోబెల్ కమిటీ ప్రకటించింది. ఇప్పటివరకు మొత్తం 111మంది సభ్యులు, 31 సంస్థలను నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఈ ఏడాది […]
Donations flood Kamala Harris’ campaign: అమెరికాలో నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తుండగా.. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా భారతీయ అమెరికన్ కమలాహారిస్ బరిలో నిల్చున్నారు. ఈ ఏడాది జూలైలో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలాహారిస్ తెరపైకి రాగా.. అప్పటినుంచి ఆమెకు మద్దతు పెరుగుతూ వస్తోంది. కమలాహారిస్ అభ్యర్థిత్వం ప్రకటించినప్పటినుంచి ఆమె ప్రచారానికి 1 బిలియన్ డాలర్లకుపైగా విరాళాలు సేకరించారు. ప్రస్తుతం అమెరికా వర్గాల్లో […]
Israeli airstrikes on Gaza mosque kill 26, injure 93: గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. ఆదివారం తెల్లవారుజామున సెంట్రల్ గాజాలోని ఓ మసీదులో దాడి చేసింది. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. 93 మందికి తీవ్ర గాయాలైనట్లు హమాస్ తెలిపింది. డెయిర్ అల్-బలాహ్ పట్టణంలో ఉన్న ఓ మసీదులో శరణార్థులు తల దాచుకున్నారు. ఈ మసీదుపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో మరణించిన వారంతా పురుషులేనని వెల్లడించింది. అయితే […]
Israel’s Attacks Against Hezbollah in Lebanon Expand: ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా, లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్‌కు చెందిన కీలక నేత సయీద్ అతల్లా మృతి చెందాడు. ఈ ఘటనలో సయీద్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా చనిపోయినట్లు సమాచారం. ఉత్తర లెబనాన్‌లోని ట్రిపోలిలోని పాలస్తీనా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ దాడులు నిర్వహించింది. ఇజ్రాయెల్ చేసిన దాడిలో హమాస్‌కు చెందిన ముఖ్య నేత సయీద్‌తో పాటు మరో ముగ్గురు […]
గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో సుమారుగా 60 మంది మరణించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. నిరాశ్రయులకు షెల్టర్ జోన్ గా ఉన్న పాఠశాల, మరొక ప్రాంతంపై ఈ దాడులు జరిగాయి. కాగా, దాదాపు 10 నెలలుగా కొనసాగుతున్న వివాదంలో కాల్పుల విరమణ చర్చలు మరోసారి నిలిచిపోయినట్లు తెలుస్తోంది.