Home / అంతర్జాతీయం
Donald Trump Warns to BRICS Countries on Tariff: టారిఫ్ ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. బ్రిక్స్ సమ్మిట్ జరుగుతున్న వేళ సభ్యత్వ దేశాలకు హెచ్చరికలు చేశారు. బ్రిక్స్ అనుకూల దేశాలపై 10 శాతం అదనంగా సుంకాలు తప్పవని హెచ్చరించారు. బ్రిక్స్ దేశాలు అమెరికా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ […]
Trump on Elon Musk Political Party: ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. మస్క్ కొత్త పార్టీని మొదలు పెట్టడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మస్క్ పాడైన రైలు లాంటి వాడని ఎద్దేవా చేశారు. నిన్న ఆయన మాట్లాడుతూ.. ‘మూడో పార్టీ పెట్టడం హాస్యాస్పదంగా ఉంది. అమెరికా రెండు పార్టీలకు సంబంధించిన వ్యవస్థ. మూడో పార్టీ మొదలుపెట్టడం అంటే.. ప్రజల్ని […]
Water resources: ప్రపంచవ్యాప్తంగా నీటి సంక్షోభం నెలకొంది. గుక్కెడు నీటికి కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లే దారుణ పరిస్థితులు అనేక దేశాల్లో నెలకొన్నాయి ఆఫ్రికా దేశాల్లో నీటి సమస్య మరింత తీవ్రంగా ఉంది. ఇదిలా ఉంటే సురక్షిత నీరు కూడా అనేక దేశాల్లో అందుబాటులో లేదు.సురక్షిత నీరు అందకపోతే మనుషులు రోగాలపాలవుతారు. ప్రాణాలు కొడిగట్టి పోతాయి. ప్రపంచవ్యాప్తంగా సురక్షిత నీటికి కోట్లాదిమంది దూరంగా ఉన్నారు. ప్రపంచజనాభాలో దాదాపు 26 శాతం మంది సురక్షిత తాగునీటికి నోచుకోవడం […]
Texas Floods 2025: అమెరికాలోని టెక్సాస్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా గ్వాడాలుపే నదిలో కేవలం 45 నిమిషాల్లోనే 26 అడుగుల నీటిమట్టం పెరిగింది. వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆకస్మికంగా సంభవించిన వరదలతో తొమ్మిది మంది చిన్నారులు సహా 43 మంది మరణించారు. అదే సమయంలో సమ్మర్ క్యాంప్ కోసం వచ్చిన 25 మంది బాలికలు సహా 29 మంది గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సెంట్రల్ […]
Elon Musk Announces New Political Party America Party: అమెరికాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గత కొంతకాలంగా అమెరికా అధ్యక్షుడు, ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. వీరిద్దరి మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇటీవల ట్రంప్ ప్రవేశపెట్టిన ‘బిగ్ బ్యూటీఫుల్ బిల్’ ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పాసైతే కొత్త పార్టీ ప్రవేశపెడ్తానని గతంలోనే మస్క్ ప్రకటించారు. అనుకున్న విధంగానే ఎలాన్ మస్క్ ‘ది అమెరికా పార్టీ’ […]
Donald Trump shocking Comments on Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ మనుషులను చంపుతూనే ఉంటారంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. యుద్ధం ఏమాత్రం మంచిది కాదంటూ ట్రంప్ హితవు పలికారు. మరోవైపు రష్యాపై మరిన్ని ఆంక్షలు ఉండొచ్చంటూ ట్రంప్ బెదిరింపులకు దిగారు. ఇటీవల ట్రంప్-పుతిన్ ఫోన్ కాల్లో మాట్లాడుకున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌తో యుద్ధ విరమణలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో డొనాల్డ్ […]
Floods In USA: అమెరికాలోని టెక్సాన్ ను వరదలు చుట్టుముట్టాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి. విపత్తులో ఇప్పటి వరకూ 24 మంది మృతి చనిపోగా.. ఓ సమ్మర్ క్యాంపు నుంచి 25 మంది బాలికలు గల్లంతయ్యారు. అధికారులు వారి కోసం గాలింపు చెపట్టారు. కేవలం మూడు గంటల్లోనే 15 నుంచి 40 సెం.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. కుండపోత వర్షాలకు టెక్సాస్ లోని హంట్ ప్రాంతంలో గ్వాడాలుపే నది […]
Pakistan: రోజుకో రకం మాట మాట్లాడటంలో పాకిస్తాన్ ను మించిన దేశం లేదు. తప్పును బుకాయిస్తారు, అబద్దాలను నిజాలని ప్రచారం చేసుకుంటారు. ఒడితే గెలిచామని పండగ చేసుకుని అక్కడి ప్రజల్ని నమ్మిస్తారు. అదోచిత్రవిచిత్రమైన దేశం. అందులో భాగంగానే కరుడు గట్టిన తీవ్రవాది, జైషే – ఎ – మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ పాకిస్తాన్ లేడని అతని ఆచూకీని చెబితే అరెస్ట్ చేస్తామని పాకిస్తాన్ రాజకీయ నాయకుడు బిలావల్ బుట్టో జర్దారీ ప్రకటన చేశాడు. దీంతో ఆశ్చర్యపోవడం […]
Trump: వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై అమెరికా ప్రసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఇది పన్ను మినహాయింపులు, ఖర్చు కోతలకు సంబంధించిన బిల్లు. ఇది వైట్ హౌస్ జూలై నాల్గవ తేదీ వేడుకల సందర్భంగా గణనీయమైన శాసనసభ విజయాన్ని సూచికగా నిలిచింది. కాంగ్రెస్‌లో బలమైన రిపబ్లికన్ మద్దతు తీసుకున్నారు. రిపబ్లికన్ శాసనసభ్యులు మరియు క్యాబినెట్ సభ్యుల చుట్టూ ఏర్పాటు చేసిన డెస్క్ వద్ద ట్రంప్ వైట్ హౌస్ డ్రైవ్‌వేలో బహుళ ట్రిలియన్ డాలర్ల బిల్లుపై సంతకం […]
Ukraine Russia War: యుద్దాలలో రసాయన ఆయుధాల ప్రయోగం తాజాగా తెరమీదకు వచ్చింది. రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య మూడేళ్లుగా యుద్దం కొనసాగుతోంది. అయితే ఒకదశలో ఉక్రెయిన్ పై పట్టు సాధించడానికి నిషేధిత రసాయన ఆయుధాలను రష్యా ప్రయోగించిన విషయం బయటపడింది. కాగా యుద్దంలో నిషేధిత రసాయన ఆయుధాలు ప్రయోగించడాన్ని తీవ్రంగా పరిగణిస్తారు. ఇందుకు అంతర్జాతీయ సమాజం ఒప్పుకోదు. ఈ నిషేధాలను 1907 నాటి హేగ్ కన్వెన్షన్ బలపరచింది.తాజాగా ఉక్రెయిన్ పై కొంతకాలం కిందట రష్యా […]