Home / అంతర్జాతీయం
Donald Trump Blocks Military Aid To Ukraine: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ దేశానికి అందించే సైనిక సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రష్యాతో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు మిలటరీ సహాయాన్ని నిలిపివేసింది. ఈ మేరకు వైట్‌హౌస్ నుంచి అధికారిక ప్రకటన వెల్లడైంది. ఇదిలా ఉండగా, రష్యా దేశంతో శాంతి విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సహకరించడం లేదని డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్నారు. అందుకే ఆ […]
UAE : యూఏఈలో భారత మహిళ షెహజాది ఖాన్‌కు మరణశిక్ష అమలు అయ్యింది. తన సంరక్షణలో ఉన్న చిన్నారి మృతి కేసులో హత్య అభియోగాలు నమోదు అయ్యాయి. దీంతో యూపీలోని బాందా జిల్లాకు చెందిన ఆమెకు యూఏఈ సర్కారు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. తమ కుమార్తెను రక్షించాలంటూ కుటుంబం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరకు ఆమె ప్రాణాలు విడిచింది. ఫిబ్రవరి 15న శిక్ష అమలు అయ్యింది. ఈ విషయాన్ని ఢిల్లీ హైకోర్టుకు విదేశాంగ శాఖ తెలియజేసింది. […]
Ukraine Ready To Sign Minerals Deal With US: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో ఉన్న బంధాన్ని తాను కాపాడుకుంటామని జెలెన్ స్కీ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఖనిజాల ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదరకపోవడం తెలిసిన విషయమే. అయితే తాజాగా, ఈ విషయంపై జెలెన్ స్కీ స్పందించారు. ట్రంప్ ఆహ్వానిస్తే.. మరోసారి భేటీకి వెళ్తానని పేర్కొన్నారు. ఆయనతో తీవ్రమైన, నిజమైన సమస్యలను పరిష్కరించేందుకు తానే సిద్ధమేనని […]
Israel-Hamas Cease fire: ఇజ్రాయిల్ అమానవీయ దాడులతో స్మశానంలా మారిన గాజాలో పూర్తి స్థాయిలో కాల్పుల విరమణకు చర్యలు చేపట్టాలని హమాస్ డిమాండ్ చేసింది. ఈ దిశగా ఇజ్రాయిల్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాలని ప్రపంచ దేశాలను కోరింది. కాల్పుల విరమణకు పూర్తి స్థాయిలో కట్టుబడి వున్నామని హమాస్ మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు హమాస్ ఒక ప్రకటన విడుదల చేసింది. కాల్పుల విరమణ, ఖైదీల మార్పిడికి వెసులుబాటు కల్పించిన మొదటి దశ కాల్పుల విరమణ ఒప్పందం […]
Moon NetworkG: నాసా అనుకున్న మిషన్ పూర్తయితే చంద్రుడిపైన త్వరలోనే ఫోన్ సిగ్నల్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంటే నేరుగా చంద్రుడి మీద నుంచి భూమ్మీద ఉన్నవారికి వ్యోమగాములు ఫోన్ చేసే అవకాశం రాబోతున్నది! అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం స్పేస్ ఎక్స్ ఫాల్కన్ రాకెట్ ప్రయోగించారు. నాసా అనుకున్న మిషన్ పూర్తయితే చంద్రుడిపైన త్వరలోనే ఫోన్ సిగ్నల్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంటే నేరుగా చంద్రుడి మీద […]
Elon Musk Welcomes 14th Child: అపరకుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి తండ్రి అయ్యాడు. తన 4వ ప్రేయసి, న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్‌గా శివోన్ జిలిస్ నాలుగో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ 14వ సంతానానికి సెల్డాన్ లైకుర్గస్ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని షివోన్ జిలిస్ స్వయంగా ప్రకటించారు. ఇప్పటివరకు ఆయనకు 13 మంది పిల్లులుండగా.. తాజాగా 14వ బిడ్డకు తండ్రి అయ్యారు. కాగా, మొదటి భార్య జస్టిన్ విల్సన్‌తో ఆరుగురు, మాజీ లవర్ […]
Trump-Zelenskyy clash in White House: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన మొదటినుంచే ఉక్రెయిన్‌కు అమెరికా అండగా నిలిచింది. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బైడెన్.. ఆ దేశానికి నిధులు, యుద్ధ సామగ్రిని సమకూర్చింది. దీంతో ఉక్రెయిన్.. రష్యా దేశానికి ధీటుగా బదులిచ్చింది. అయితే ఇటీవల అమెరికాలో జరిగిన ఎన్నికల్లో బైడెన్ ఘోరంగా ఓటమి చెందారు. దీంతో రాజకీయాలు తారుమారైపోయాయి. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. ఉక్రెయిన్‌కు నిధులు ఆపేశారు. రష్యా, ఉక్రెయిన్ […]
Earthquake of magnitude 6.1 strikes Nepal: నేపాల్‌లో మరోసారి భూకంపం వచ్చింది. నేపాల్ రాజధాని ఖాట్మాండూ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన విషయాలు తెలియరాలేదు. An earthquake with a magnitude of 5.5 on the Richter Scale hit Nepal […]
Alternative Sources of Energy Fuel Sources: ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికీకరణ, మాడ్రాన్ లైఫ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మానవుని ఇంధన వనరులు సైతం పెరుగుతున్నాయి. అయితే, రెండో ఆలోచన లేకుండా, కేవలం అవసరాలే ప్రాతిపదికగా యథేచ్ఛగా ఇంధన వనరులను వాడటం వల్ల పర్యావరణ సమస్యలతో బాటు అనేక కొత్త సమస్యలూ పుట్టుకొస్తున్నాయి. కాగా, ఇంధన వనరుల అవసరాలు పెరుగుతున్న తరుణంలో భూమి మీద గ్రీనరీ నశించిపోతుండగా.. మానవుడి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇక.. డిమాండుకు తగినంతా […]
Mystery illness kills 53 people in Congo: ప్రపంచాన్ని వణికించేందుకు మరో వైరస్ దూసుకొస్తుంది. ఈ వైరస్ బారిన పడితే కేవలం 48 గంటల్లోనే చనిపోతున్నారు. దీంతో డబ్ల్యూహెచ్ఓ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది వెంటనే అప్రమత్తం కావాలని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఈ వింత వ్యాధి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో బయటపడింది. ఈ వ్యాధి కాంగో దేశాన్ని వణికిస్తోంది. గత 5 వారాలుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వింత వ్యాధి సోకితే […]