Last Updated:

Saudi Arabia: సౌదీ అరేబియాలో భారీ ఎత్తున బంగారం, రాగి నిక్షేపాలు

సౌదీ అరేబియాలో భారీ ఎత్తున బంగారం, రాగి నిక్షేపాలు బయటపడ్డాయి. ముస్లింలకు పుణ్యక్షేత్రమైన మదీనాలో అపారమైన బంగారం, రాగి ఖనిజాలు ఉన్నట్టు గుర్తించామని సౌదీ అరేబియా అధికారికంగా ప్రకటించింది.

Saudi Arabia: సౌదీ అరేబియాలో భారీ ఎత్తున బంగారం, రాగి నిక్షేపాలు

Saudi Arabia: సౌదీ అరేబియాలో భారీ ఎత్తున బంగారం, రాగి నిక్షేపాలు బయటపడ్డాయి. ముస్లింలకు పుణ్యక్షేత్రమైన మదీనాలో అపారమైన బంగారం, రాగి ఖనిజాలు ఉన్నట్టు గుర్తించామని సౌదీ అరేబియా అధికారికంగా ప్రకటించింది. బంగారు, రాగి కొత్త గనులను కనుగొన్నట్లు ఆ దేశానికి చెందిన జియోలాజికల్‌ సర్వే తన ట్వీట్‌లో తెలిపింది. మదీనా ప్రాంతంలో ఉన్న అబా అల్‌ రహ వద్ద బంగారం నిక్షేపాలు ఉన్నట్లు వెల్లడించారు. వాది అల్ ఫారా ప్రాంతంలో సుమారు నాలుగు చోట్ల రాగి గనులు ఉన్నట్లు భావిస్తున్నారు.

ఈ నూతన నిక్షేపాల ద్వారా సౌదీకి 533 మిలియన్ డాలర్ల పెట్టుబడి వచ్చే అవకాశం ఉందని, 4 వేల ఉద్యోగాలు కూడా లభిస్తాయని స్థానిక మీడియా పేర్కొంది. సౌదీ అబిరేయాలో 5,300 ప్రాంతాల్లో ఖనిజ లవణాలు లభ్యమవుతాయని సౌదీ జియాలజిస్ట్స్ కోఆపరేటివ్ అసోసియేషన్ చైర్మన్ అబ్దులజీజ్ బిన్ లబాన్ గతంలో తెలిపారు.

ఇవి కూడా చదవండి: