Last Updated:

China Balloon: మరోసారి చైనా బెలూన్ కలకలం.. లాటిన్ అమెరికా దేశాలపై ఎగిరిన స్పై బుడగ.. అమెరికా, చైనా వార్ ముదరనుందా..?

అమెరికా దేశాలపై చైనా బెలూన్స్ దర్శనమివ్వడం తీవ్ర కలకలాన్ని సృష్టిస్తున్నాయి. ఇటీవల తాజాగా అమెరికా దేశ సరిహద్దుల్లో ఆకాశంలో తెల్లటి ఆకారంలో చైనా స్పై బెలూన్ కనిపించింది. దానితో ఆగ్రహించిన అమెరికా ఏఐఎం-9 ఎక్స్ సైడ్ వైండర్ అనే క్షిపణితో ఆ స్పై బెలూన్ను కూల్చివేసిన సంగతి తెలిసిందే.

China Balloon: మరోసారి చైనా బెలూన్ కలకలం.. లాటిన్ అమెరికా దేశాలపై ఎగిరిన స్పై బుడగ.. అమెరికా, చైనా వార్ ముదరనుందా..?

China Balloon: అమెరికా దేశాలపై చైనా బెలూన్స్ దర్శనమివ్వడం తీవ్ర కలకలాన్ని సృష్టిస్తున్నాయి. ఇటీవల తాజాగా అమెరికా దేశ సరిహద్దుల్లో ఆకాశంలో తెల్లటి ఆకారంలో చైనా స్పై బెలూన్ కనిపించింది.

దానితో ఆగ్రహించిన అమెరికా ఏఐఎం-9 ఎక్స్ సైడ్ వైండర్ అనే క్షిపణితో ఆ స్పై బెలూన్ను కూల్చివేసిన సంగతి తెలిసిందే.

అయితే ఆ బెలూన్ ద్వారా చైనా అమెరికాపై గూఢచర్యానికి పాల్పడుతోందని ఆ దేశ ప్రధాన ఆరోపణ.

కానీ చైనా మాత్రం అది వాతావరణ మార్పులను అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన బెలూన్ అని చెబుతోంది.

మరోసారి స్పై బెలూన్ కలకలం

ఈ తరుణంలోనే, మరోసారి ఈ బెలూన్(China Balloon) దర్శనమిచ్చింది. ఈ సారి లాటిన్ అమెరికా దేశాలపై తారసపడింది. అయితే ఇది కూడా చైనా బెలూన్ అని వెల్లడైయ్యింది.

కాగా ఈ బెలూన్ విషయాన్ని లాటిన్ అమెరికా దేశాలు టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాయి.

ఈ రెండో బెలూన్ ను కూడా మొదట గుర్తించింది అమెరికా రక్షణశాఖే కావడం విశేషం.

అమెరికా గగనతలంపై ఎగిరిన బెలూన్ తరహాలోనే ఈ బెలూన్ కూడా ఉండడంతో అమెరికా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. చైనా కూడా ఆ రెండో బెలూన్ తమదేనని స్పష్టం చేసింది.

ఈ చైనా బెలూన్ అమెరికా దేశాలైన కొలంబియా, వెనిజులా, కోస్టారికా మీదుగా పయనించినట్టు సమాచారం.

కాగా ప్రస్తుతం ఈ రెండో బెలూన్ ఎక్కడుందనే సమాచారం తెలియరాలేదు.

పట్టించుకోని లాటిన్ అమెరికా..

చైనాతో వాణిజ్య పరంగా సన్నిహిత సంబందాలున్న లాటిన్ అమెరికా దేశాలు మాత్రం ఈ బెలూన్ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదనే తెలుస్తోంది.

కానీ అమెరికా రక్షణ శాఖ మాత్రం దీనిపై తప్పకుండా ఓ కన్నేసి ఉంటుందని విశ్లేషకుల వాదన.

అయితే కూల్చేసిన బెలూన్ శిథిలాలను చైనాకు అప్పగించాలని ఆ దేశం కోరగా .. ఇచ్చే ప్రసక్తేలేదని అమెరికా తేల్చి చెప్పింది.

ఆ శకలాలను పరిశీలించిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై తదుపరి యాక్షన్ ఉంటుందని అమెరికా చెప్పుకొచ్చింది.

ఇదేం తొలిసారి కాదు..

మరి ఈ విషయం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.

ఇకపోతే ఇలా బెలూన్లు అమెరికా గగనతలంలో ఎగరడం కొత్తేమి కాదని.. గతంలోనూ చాలా బెలూన్లు వచ్చాయి కానీ ఇంతసేపు కనిపించడం ఇదే తొలిసారని వారు చెప్పుకొచ్చారు.

జనవరి 28న ఈ బెలూన్ అమెరికాలోని అలస్కా ప్రాంతంలోని ఆకాశంలో కనిపించింది.

ఆ తర్వాత కెనడా, మరి కొద్ది రోజుల తర్వాత మళ్లీ అమెరికాలో కనిపించిందని అమెరికా ఆరోపిస్తుంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/