Last Updated:

Whatsapp New Features: వాట్సాప్ లో సరికొత్త ఫీచర్స్.. ఒకేసారి 100 మీడియా ఫైల్స్ షేరింగ్

యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్. మరో సరికొత్త ఫీచర్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకు వచ్చింది.

Whatsapp New Features: వాట్సాప్ లో సరికొత్త ఫీచర్స్.. ఒకేసారి 100 మీడియా ఫైల్స్ షేరింగ్

Whatsapp New Features: యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్. మరో సరికొత్త ఫీచర్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకు వచ్చింది.

ఒకేసారి 100 మీడియా ఫైల్స్ ను షేర్ చేసేలా యాప్ ను అప్ డేట్ చేసింది.

ప్రైవేట్ ఆడియన్స్ సెలెక్టర్, వాయిస్ స్టేటస్, స్టేటస్ రియాక్షన్స్, స్టేటస్ ప్రొఫైల్, లింక్ ప్రివ్యూ ఫీచర్స్‌ వంటి వాటిని పరిచయం చేసింది.

వాటితో పాటు మరో సరికొత్త ఫీచర్ ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ లో ఒకేసారి 100 మీడియా ఫైల్స్ ను షేర్ చేసుకునే వీలు కల్పించింది.

ఇంతముందు వాట్సాప్ లో 30 మీడియా ఫైల్స్ మాత్రమే షేర్ చేసే వీలుంది. ఇపుడు అది 100 కు పెంచుతూ వాట్సాప్ నిర్ణయం తీసుకుంది.

ఒకే క్లిక్ తో 100 ఫైల్స్ షేర్

అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ అప్ డేట్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఒక వేళ కొత్త ఫీచర్ అప్ డేట్ కాకుంటే.. ఫోన్లతో వాట్సాప్ ఆండ్రాయిడ్ 2.23.4.3 వెర్షన్ ను అప్ డేట్ చేయాలి.

ఐఓఎస్ యూజర్లకు సైతం త్వరలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని వాట్సాప్ వెల్లడించింది. తరచూ ఫొటోలు షేర్ చేసుకునే వారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.

వేర్వేరుగా ఫొటోలు, లేదా మీడియా ఫైల్స్ ను షేర్ చేయడానికి బదులుగా ఒకే క్లిక్ తో మొత్తం అల్బమ్ ను ఈ ఫీచర్ ద్వారా షేర్ చేయవచ్చు.

ఇదే కాకుండా, మరికొన్ని కొత్త యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లను కూడా వాట్సాప్ సిద్ధం చేస్తోంది.

ముఖ్యమైన చాట్స్ ను సులభంగా గుర్తించేందుకు పిన్ చేసుకునే సదుపాయాన్ని మరింత విస్తరించింది.

గ్రూప్స్ చాట్స్, వ్యక్తిగత చాట్స్ లో ముఖ్యమైన మెసేజ్ లను ఇకపై ప్రత్యేకంగా పిన్ చేసుకోవచ్చు.

అయితే, ఇందుకు కూడా వాట్సాప్ యూజర్ లేటెస్ట్ వర్షన్ కు అప్ డేట్ అయి ఉండాలి.

30 సెకన్ల ఆడియో కూడా

మరో ఫీచర్ వాట్సప్ స్టేటస్‌లో ఫోటోలు, వీడియోలు, లింక్స్ అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇక నుంచి వాట్సప్ స్టేటస్‌లో 30 సెకన్ల ఆడియో కూడా అప్‌డేట్ చేసుకునే వీలుంది.

ఏదైనా టైప్ చేయడం కన్నా వాయిస్ రికార్డ్ ద్వారా చెప్పాలనుకునేవారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.

 

స్టేటస్ రియాక్షన్స్

వాట్సప్ స్టేటస్‌కి వేగంగా రిప్లై ఇచ్చేందుకు స్టేటస్ రియాక్షన్స్ ఫీచర్ అందిస్తోంది వాట్సప్. ఈ ఫీచర్‌ను వాట్సప్ యూజర్లు చాలా కాలంగా కోరుకుంటున్నారు.

స్టేటస్‌కి మెసేజ్, వాయిస్ మెసేజ్, స్టిక్కర్స్ ద్వారా రిప్లై ఇవ్వొచ్చు.

 

ప్రైవసీ సెట్టింగ్స్‌లో మార్పులు

వాట్సాప్ లో షేర్ చేసే ప్రతీ స్టేటస్ కాంటాక్ట్‌లో ఉన్న యూజర్లు అందరికీ కాకపోవచ్చు. అందుకే ప్రైవసీ సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేసింది వాట్సప్ .

మీరు అప్‌డేట్ చేసే స్టేటస్ ఎవరు చూడాలో నిర్ణయించే అవకాశం ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసిన ఆడియన్స్ సెలెక్షన్ తర్వాత స్టేటస్‌కు డిఫాల్ట్‌గా ఉంటుంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/