Last Updated:

Vitamin D: విటమిన్-డి లోపం వల్ల ఈ లక్షణాలు కనిపిస్తాయి..

విటమిన్-డి లోపం వల్ల మనకి తెలియకుండా మన ఆరోగ్యం దెబ్బ తింటుంది. దీన్ని గుర్తించాలంటే చాలా కష్టమే. కానీ మనం కొన్ని రకాల డి విటమిన్ లక్షణాలను గుర్తించవచ్చు.

Vitamin D: విటమిన్-డి లోపం వల్ల ఈ లక్షణాలు కనిపిస్తాయి..

Vitamin D Deficiency: విటమిన్-డి లోపం వల్ల మనకి తెలియకుండా మన ఆరోగ్యం దెబ్బ తింటుంది. దీన్ని గుర్తించాలంటే చాలా కష్టమే. కానీ మనం కొన్ని రకాల డి విటమిన్ లక్షణాలను గుర్తించవచ్చు. కానీ కష్టం కాబట్టి ఒకవేళ మీకు ఎక్కువ సందేహం కలిగి ఉంటే డాక్టర్ ని కన్సల్ట్ చేయడం మంచిది. కొన్ని రకాల లక్షణాల ద్వారా మనకి విటమిన్ డి లోపం ఉందే లేదో తెలుసుకోవచ్చు.

ఒక్కోసారి మంచిగా ఉన్నా నీరసంగా ఉండటం, ఎముకల నొప్పి, మజిల్ వీక్నెస్, మజిల్ పెయిన్స్, డిప్రెషన్, తలనొప్పి, మితి మీరిన కోపం ఇటువంటి లక్షణాల ద్వారా విటమిన్ డి లోపం మనకి ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఈ లక్షణాలు మనలో కనిపిస్తే మనకి విటమిన్-డి లోపం ఉన్నట్లే. పిల్లల్లో ఐతే రికెట్స్ సమస్య వస్తుంది. దీంతో వాళ్ళ యొక్క ఎదుగుదల పూర్తిగా తగ్గిపోతుంది. మజిల్ వీక్నెస్, ఎముకల నొప్పులు ఇలా పలు రకాల సమస్యలు విటమిన్-డి లోపం వల్ల కలుగుతాయి.

విటమిన్ డి ఆహార పదార్ధాలు..

ఫ్యాటి చేపల్లో విటమిన్ డి ఎక్కువుగా ఉంటుంది. సాల్మన్, కాడ్ మరియు ట్యూనా వంటి చేపలను మీరు ఆహారంలో తీసుకున్నా మీకు విటమిన్ డి లభిస్తుంది. మనం రోజూ తీసుకునే గుడ్లలో కూడా విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ కాడ్ లివర్ ఆయిల్లో 1,300 IU విటమిన్ డి ఉంటుంది. శాఖాహారులైతే పాలు తీసుకుంటే చాలు. పుట్టగొడుగుల్లో కూడా విటమిన్ డి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నారింజలో కూడా ఎక్కువ విటమిన్ డి మనకి లభిస్తుంది.

ఇవి కూడా చదవండి: