Health Tips : చలి కాలంలో ఈ టిప్స్ ఫాలో అయితే కీళ్ల నొప్పులకు చెక్ పెట్టొచ్చు ..!
Health Tips : సాధారణంగా చలి కాలంలో ఎక్కువ బాధించే సమస్య కీళ్ల నొప్పులు. చల్లటి వాతావరణం సహజంగా కండరాలను మరింత బిగుతుగా చేస్తుంది. దీంతో చలి గాలికి నడవడం, కూర్చోవడం, పని చేయడం కొంతమేర కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వయసు పెరిగే ఎముకల్లో బలం తగ్గుతుండడంతో ఈ నొప్పులు వస్తూ ఉంటాయి. ఈ తరుణంలోనే ఈ నొప్పులను కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించి పోగొట్టవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో మీకోసం ప్రత్యేకంగా…
- చలికి బయటికి వెళ్లేటప్పుడు శీతాకాలపు దుస్తులను ధరించడం ముఖ్యం.
- స్వెటర్లు, షూస్, సాక్స్ ధరించి వెళ్ళడం ద్వారా శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. దీంతో నొప్పులకు చెక్ పెట్టొచ్చు.
- అలానే వ్యాయామం చేసేటప్పుడు మీ చేతులు మరియు కాళ్ళను పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించాలి.
- ఇంటి లోపల వెచ్చగా ఉండేలా చూసుకోవాలి దీంతో కీళ్ల నొప్పులును కొంత తగ్గించవచ్చు.
- కీళ్ళు లేదా ఎముకల నొప్పి తర్వాత వేడి నీటి బాటిల్ లేదా హీటింగ్ ప్యాడ్‌ని ఆ ప్రదేశం లో పట్టి నొప్పిని నివారించవచ్చు.
- వ్యాయామం చేసే సమయంలో కీళ్ల నొప్పులు లేదా ఎముకల నొప్పి వచ్చిన వెంటనే వ్యాయామాలను ఆపకూడదు.
- కొంతసేపు మీ కదలికలను కంటిన్యూ చేయకపోతే ఆ నొప్పి మరింత ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది.
- మీ శరీరాన్ని చురుకుగా మరియు ఫిట్‌గా ఉంచడానికి వెచ్చని పూల్‌లో ఇండోర్ స్విమ్మింగ్, యోగా, నడక, వెయిట్ లిఫ్టింగ్ చేయవచ్చు.
- అలాగే, వెచ్చని స్నానం మీ కండరాలకు విశ్రాంతి ఇనిస్తుంది, మీ శరీరంలో ఒత్తిడిని తగ్గిస్తుంది.
- చలికాలంలో కూడా మనం ఎక్కువగా డీహైడ్రేషన్‌కు గురవుతుండాలి. అందుకే ఎక్కువగా నీరు తాగాలి.
- చలికాలంలో వేడి ఆహారాన్ని, నూనెతో కూడిన స్నాక్స్‌ను తీసుకోవడం తగ్గించాలి.
- గోళ్లను బలోపేతం చేసే కాల్షియం అధికంగా ఉండే ఆకుకూరలు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.
ఈ సూచనలను పాటించి కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.