Viduthalai 2: నెల రోజుల ముందే ఓటీటీకి విజయ్ సేతుపతి విడుదల 2 – స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడంటే?
Viduthalai 2 OTT Release and Streaming: విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘విడుదల 2’. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 20 థియేటర్లోకి వచ్చింది. 2023లో వచ్చిన విడుదల సినిమాకు ఇది సీక్వెల్. తమిళ్, తెలుగులో విడుదలైన ఫస్ట్ పార్ట్ భారీ విజయం సాధించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించడంతో మూవీపై భారీ అంచానాలు నెలకొన్నాయి.
ఎన్నో అంచనాల మధ్య డిసెంబర్ 20న తమిళ్, తెలుగులో రిలీజైన ఈ చిత్రం ఆడియన్స్‌ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పార్ట్ వన్ స్థాయిలో సీక్వెల్ ఆడియన్స్‌ని మెప్పించలేకపోయింది. దీంతో బాక్సాఫీసు వద్ద డివైడ్ టాక్ తెచ్చుకు విడుదల 2 ఫస్ట్ డే మంచి వసూళ్లు చేసింది. ఆ తర్వాత కలెక్షన్స్ నిరాశపరిచాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయ్యింది. సినిమా విడుదలైన నెల రోజుల ముందే విడుదల 2ను డిజిటల్ ప్రీమియర్ తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
కాగా ఈ మూవీ ఓటీటీ హక్కులను జీ5(ZEE5) సొంతం చేసుకుంది. థియేటర్‌లో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని అనుకున్న తేదీ కంటే ముందుగా రిలీజ్ చేసేందుకు జీ5 ప్లాన్ చేస్తుందంట. జనవరి 17న విడుదల 2ను స్ట్రీమింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై జీ5 సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తమిళ్, తెలుగు వెర్షన్ రెండు ఒకే రోజున జీ5లో అందుబాటులోకి తీసుకురానుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. పొలిటిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవానీ శ్రీ ముఖ్య తారలుగా నటించారు.