Last Updated:

Akkineni Nageshwar Rao: 250 స్క్రీన్ల పై ఏఎన్ఆర్ నటించిన “ప్రతిబింబాలు”.. తెరకెక్కించి 4 దశాబ్ధాలు

సినిమాను తెరకెక్కించిన 40 ఏళ్ల తర్వాత మరో మారు తెలుగు సినీ ప్రేక్షుకులకు తన నటనాభియాన్ని చూపించేందుకు ఆనాటి యువహీరో అక్కినేని నాగేశ్వరరావు నేటి ఆధునిక స్క్రీన్లలో డ్యూయల్ రోల్ లో కనువిందు చేయనున్నారు.

Akkineni Nageshwar Rao: 250 స్క్రీన్ల పై ఏఎన్ఆర్ నటించిన “ప్రతిబింబాలు”.. తెరకెక్కించి 4 దశాబ్ధాలు

Tollywood: అలనాటి తెలుగు నటుల్లో అతనో నటసామ్రాట్. తెలుగు చిత్ర సీమకు జీవంపోసిన వారిలో అతనిదొక హుందా ప్రయాణం. విమర్శకులు, కళాభిమానుల అభిమానాన్ని చూరగొన్న గొప్ప ఆ సినీ నటుడు మరణాంతరం ఓ చిత్రం 250 ధియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రేపటిదినం విడుదల కాబోతుంది. ఆ సినిమాను తెరకెక్కించిన 40 ఏళ్ల తర్వాత మరో మారు తెలుగు సినీ ప్రేక్షుకులకు తన నటనాభియాన్ని చూపించేందుకు ఆనాటి యువహీరో అక్కినేని నాగేశ్వరరావు నేటి ఆధునిక స్క్రీన్లలో డ్యూయల్ రోల్ లో కనువిందు చేయనున్నారు.

1982లో రాజేశ్వర్ రాచర్ల సమర్పణలో విష్ణు ప్రియ సినీ కంబైన్స్ పతాకం పై అక్కినేని నాగేశ్వరావు, జయసుధ జంటగా కీ. శే.కె. యస్. ప్రకాషరావు దర్శకత్వంలో జాగర్ల మూడి రాధాకృష్ణ మూర్తి నిర్మించిన చిత్రం “ప్రతిబింబాలు”. చిత్ర నిర్మాణాన్ని ప్రారంభంలో ఏకధాటిగా చేపట్టారు. సినిమా షూటింగ్ మద్యలో అక్కినేనికి గుండెనొప్పి రావడడంతో అమెరికా వెళ్లారు. దీంతో రెండు సంవత్సరాలు పాటు ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అంతా రెడీ చేసుకొన్నాక హీరోయిన్ పాత్రలోని జయసుధ గర్భం దాల్చడంతో షూటింగ్ కొరకు మరికొంతకాలం వేచివుండాల్సి వచ్చింది.

అనంతరం నటీనటులు ఇద్దరూ డేట్స్ ఇచ్చినా కొన్ని కారణాలతో డైరెక్టర్ రాలేకపోయారు. అనంతరం నాగేశ్వరావు గారే స్వయంగా కలిపించుకొని కె. యస్ ప్రకాష్ గారిని డైరెక్షన్ చెయ్యమని చెప్పి ఆయన సపోర్ట్ తో సినిమా పూర్తి చేశారు. రీ రికార్డింగ్ దశలో అడ్వాన్స్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ వెనక్కు వెళ్లడంతో ఫైనాన్స్ ఇబ్బందులతో సినిమా పూర్తిగా ఆగిపోయింది. అనంతరం 4దశాబ్ధాల తర్వాత రాచర్ల రాజేశ్వర్ రావు నేతృత్వంలో సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు. ఈ నెల 5 న (రేపటిదినం) విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరావు నటించిన ప్రతిబింబాలు సినిమాను నిర్మాత జాగర్ల మూడి రాధాకృష్ణ మూర్తి ఎంతో ధైర్యం చేసి వరల్డ్ వైడ్ రిలీజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయంగా పేర్కొన్నారు. నిర్మాత జాగర్ల మూడి రాధాకృష్ణ మూర్తి మాట్లాడుతూ, ఇంతకు ముందు నేను తీసిన సినిమాలు అన్నీ విజయం సాధించాయి. ఆనాటి సినిమాలను చూసి నాగేశ్వరావు స్వయంగా నన్ను పిలిచి నాతో సినిమా చెయ్యమని నాటి కాలంలో కాల్ షీట్స్ ఇచ్చిన సంగతిని గుర్తుచేశారు.

జాగర్ల స్థానంలో చిత్ర నిర్మాత బాధ్యతలను చేపట్టిన రాచర్ల రాజేశ్వర్ రావు మాట్లాడుతూ, మంచి కధనంతో కూడిన ప్రతిబింబాలు లాంటి సినిమా మళ్ళీ రాదన్నారు. ఏఎన్ఆర్ సినిమా రిలీజ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, అక్కినేని నాగేశ్వరరావు నటించిన చిత్రం విడుదల కాకుండా మిగిలిపోయిన ప్రతిబింబాలు సినిమా రేపటిదినం రిలీజ్ అవ్వడం గొప్ప విషమన్నారు. అక్కినేని నాగేశ్వరావు, నందమూరి తారక రామారావు లు ఇద్దరూ ప్రపంచ ప్రఖ్యాతగాంచి అందరి హృదయాల్లో నిలిచిపోయిన హీరోలుగా మిగిలిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యన్నారాయణ, తాజా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

అక్కినేనికి మంచి పేరును సంపాదించిన చిత్రాల్లో ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం, భక్తతుకారం, మిస్సమ్మ, మాయాబజార్, దొంగరాముడు, డాక్టర్ చక్రవర్తి, దసరా బుల్లోడు, శాంతి నివాసం, బాటసారి, కాలేజి బుల్లోడుతోపాటు పలు సినిమాలు బాక్సాఫీసులో హిట్ లుగా నిలిచాయి. రేపటిదినం విడుదల కానున్న ప్రతిబింబాల సినిమా కూడా విజయం సాధించాలని ఆశిద్ధాం.

ఇది కూడా చదవండి: Apsara Rani: ప్రసాద్ ల్యాబ్ లో “తలకోన” చిత్ర షూటింగ్ ప్రారంభం