World’s Smallest TV: ప్రపంచంలోనే అత్యంత చిన్న టీవీ.. దీని సైజ్ ఎంతో తెలిస్తే ఔరా అనక మానరు..!
ఇప్పుడు పెద్దపెద్ద స్క్రీన్ టీవీలు ఆవిషృతం అవుతున్నాయి. ఎంత పెద్ద టీవీ స్క్రీన్ లో చూస్తే అంత మంచి విజువల్ ఎఫెక్ట్ ఉంటుందని ఇప్పటి కాలం ప్రజలు నమ్ముతున్నారు. కానీ ఇందుకు భిన్నంగా ఓ కంపెనీ ఆలోచించింది. స్టాంప్ సైజ్ పరిమాణంలో ఉన్న అతి చిన్న టీవీలకు రూపకల్పన చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్న టీవీ.
World’s Smallest TV: సాధారణంగా మనం 32 ఇంచుల టీవీలను చూస్తుంటాము. ఇప్పుడు పెద్దపెద్ద స్క్రీన్ టీవీలు ఆవిషృతం అవుతున్నాయి. ఎంత పెద్ద టీవీ స్క్రీన్ లో చూస్తే అంత మంచి విజువల్ ఎఫెక్ట్ ఉంటుందని ఇప్పటి కాలం ప్రజలు నమ్ముతున్నారు. కానీ ఇందుకు భిన్నంగా ఓ కంపెనీ ఆలోచించింది. అందరూ పెద్దపెద్ద టీవీలనే తయారు చేస్తే ఎలా మనం అతి చిన్న టీవీలను తయారు చేద్దాం అంటూ స్టాంప్ సైజ్ పరిమాణంలో ఉన్న అతి చిన్న టీవీలకు రూపకల్పన చేసింది.
ప్రపంచంలోనే అత్యంత తక్కువ సైజులో ఉన్న ఈ టీవీని టెక్ నిపుణులు తయారు చేశారు. ‘టైనీ టీవీమినీ’పేరుతో రూపొందించబడిన ఈ టీవీ తెర పరిమాణం కేవలం 0.6 అంగుళాలు మాత్రమే. దీనిలో వీడియోలు దాచిపెట్టుకోవచ్చు. అందులో ఉండే స్పీకర్‌తో ఓ గంట పాటు పాటలు వినొచ్చు. ఈ చిట్టి పొట్టి టీవీని టైనీ సర్క్యూట్స్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ రూపొందించింది. ఇకపోతే ఈ టీవీలో వీడియోలను వినియోగదారులు లోడ్ చేసుకోవచ్చు లేదా కంప్యూటర్‌కు కనెక్ట్ చేయడానికి యూఎస్బీ-సీ కేబుల్‌ని ఉపయోగించి ఈ చిట్టిపొట్టి టీవీ ద్వారా ప్రసారం చేయవచ్చు. టైనీటీవీ-2 మరియు గ్రేప్-సైజ్ టైనీటీవీ మినీ రెండూ 8జీబీ మైక్రో ఎస్డీ కార్డ్ ఇన్‌స్టాల్‌తో అందుబాటులోకి వస్తాయి. ఈ రెండు పరికరాలు 10 మరియు 40 గంటల ఫుటేజీని కలిగి ఉంటాయి. రెండు మోడల్‌లను అంతర్నిర్మిత బటన్‌లు లేదా నాబ్‌ల ద్వారా నియంత్రించవచ్చు. టైనీ సర్క్యూట్స్ ఐచ్ఛిక ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోలర్‌ను కూడా సృష్టించింది. దీని సహాయంతో ఈ టీవీని ఆన్ చేయవచ్చు, వాల్యూమ్‌ను మార్చవచ్చు లేదా వీడియో ప్లే చేయడాన్ని మార్చవచ్చు.
ప్రపంచంలోనే అతి చిన్న టీవీలను టైనీ సర్క్యూట్స్ వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు కెన్ బర్న్స్ రూపొందించారు. ఈ టీవీలను యూఎస్ఏలోని ఓహియోలో తయారు చేశారు.చిన్న ఎలక్ట్రానిక్స్ కంపెనీ 2012లో TinyDuino ప్రాజెక్ట్ అనే చిన్న కంప్యూటర్ ప్రాసెసర్‌తో తన మొదటి ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.
ఇదీ చదవండి: ఈ హెయిర్ కట్ మహా డేంజర్ గురూ.. ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు