Last Updated:

Liger Movie Review: లైగర్ సినిమా రివ్యూ హిట్టా లేక ఫట్టా

విజయ్ దేవరకొండ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై స్టార్ హీరోగా నటించిన సినిమా " లైగర్ " నేడు రిలీజ్ అయింది . నిజానికి చెప్పాలంటే పూరి జగన్నాధ్ ఈ సినిమాకి ఎన్నడూ లేని విధంగా సీన్స్ కొత్తగా సృష్టించుకుంటు దర్శకత్వం వహించారనే చెప్పుకోవాలి . ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు నుంచే లైగర్ సినిమా బృందం ప్రమోషన్స్ బాగా చేశారు.

Liger Movie Review: లైగర్ సినిమా రివ్యూ హిట్టా లేక ఫట్టా

సినిమా రివ్యూ : లైగర్
రేటింగ్ : 2/ 5
నటీనటులు : విజయ్ దేవరకొండ, అనన్యా పాండే, రమ్యకృష్ణ, విష్, రోనిత్ రాయ్, ఆలీ, ‘గెటప్’ శ్రీను, చుంకీ పాండే, ‘టెంపర్’ వంశీ తదితరులు
సినిమాటోగ్రఫీ : విష్ణు శర్మ
సంగీతం : విక్రమ్ మోంట్రోస్, తనిష్క్ బగ్చి, లిజో జార్జ్, డీజీ చీతాస్, సునీల్ కశ్యప్, జానీ
నిర్మాతలు : పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా
దర్శకత్వం : పూరి జగన్నాథ్
విడుదల తేదీ: ఆగస్టు 25, 2022

విజయ్ దేవరకొండ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై స్టార్ హీరోగా నటించిన సినిమా ” లైగర్ ” నేడు రిలీజ్ అయింది. నిజానికి చెప్పాలంటే పూరి జగన్నాధ్ ఈ సినిమాకి ఎన్నడూ లేని విధంగా సీన్స్ కొత్తగా సృష్టించుకుంటు దర్శకత్వం వహించారనే చెప్పుకోవాలి. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు నుంచే లైగర్ సినిమా బృందం ప్రమోషన్స్ బాగా చేశారు. ఈ లైగర్ రౌడి విజయ్ దేవరకొండ గురించి ఎంత చెప్పినా తక్కువే. వాట్ లగా దెంగే అంటూ సినిమాకు ఒక కొత్త క్రేజ్ తీసుకొచ్చాడు. ఈ సినిమా విజయ్ దేవరకొండ ప్రాణం పెట్టి నటించాడు. వీళ్ళద్దరు ఇన్ని నెలల పడిన కష్టం నేడు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు రిలీజ్ అయ్యాయి. ప్రీమియర్ షోల నుంచి లైగర్ సినిమాకు సంబంధించిన రివ్యూస్ కూడా వచ్చేస్తున్నాయి. ప్రీమియర్ షోల నుంచి ఈ సినిమాకి టాక్ ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. భారీ రేంజులో సినిమాకు ప్రోమోషన్స్ చేశారు. అదే విధంగా భారీ హీట్ టాక్ సొంతం చేసుకుంటుందో లేదో అనేది ఇపుడు చూద్దాం. లైగర్ 140 నిమిషాల రన్ టైం తో సినిమా  ప్రారంభం అవుతుంది.

కథ :
లైగర్ (విజయ్ దేవరకొండ) కరీంనగర్ కుర్రాడు. తన తల్లి (రమ్యకృష్ణ) తో కలిసి ముంబై వెళతాడు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ కావాలనేది అతని లక్ష్యం. తల్లి కొడుకుల దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు. కోచింగ్ తీసుకోవడానికి ఫీజ్ కూడా కట్టలేమని చెప్తారు. లైగర్ తండ్రితో గతంలో పరిచయం ఉన్న క్రిస్టోఫర్ లైగేర్ కు ఫ్రీగా కోచింగ్ ఇవ్వడానికి ముందుకు వస్తారు. కోచింగ్ తీసుకునే సమయంలోనే లైగర్ కు తాన్యా (అనన్యా పాండే) పరిచయం అవుతుంది. అప్పుడు ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే, లైగరుకు నత్తి అని తెలిశాక తాన్య వదిలేసి వెళ్ళిపోతుంది. అదే ‘లైగర్’లో కసి పెంచుతుంది. ఆ కసితో ఇండియాలో ఎంఎంఎ ఛాంపియన్ అవుతాడు. ఆ తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్‌కు వెళ్ళడానికి లైగర్ దగ్గర డబ్బులు ఉండవు. అప్పుడు అమెరికాలో ఒకరు స్పాన్సర్ చేస్తారు. ఆయన ఎవరు? అమెరికా వెళ్ళిన తర్వాత మళ్ళీ లైగర్ జీవితంలోకి తాన్య ఎలా వచ్చింది. ఎందుకు రావాల్సి  వచ్చింది. తాన్యా ను కిడ్నాప్ చేస్తారు. ఎవరో కిడ్నాప్ చేస్తే లైగర్ ఎందుకు తాన్యాను కాపాడటానికి వెళ్తాడు? ఆల్ టైమ్ గ్రేట్ మైక్ టైసన్‌తో లైగర్ ఎందుకు ఫైట్ చేయాల్సి వచ్చింది? ఆ తర్వాత ఏమి జరిగింది ?

విశ్లేషణ :
‘లైగర్’లో సినిమాలో మాస్ డైలాగ్స్, ఊర మాస్ డైలాగ్స్ మిస్ అయ్యాయనే చెప్పుకోవాలి. విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్‌కు నత్తి పెట్టడంతో పంచ్ డైలాగ్స్ సినిమాలో ఎక్కువ పెట్టె ఛాన్స్ దొరకలేదు. కొత్తదనం కోసం ఈ సినిమా చూడటానికి వెళదామనుకుంటే కథలో కొత్తదనం లేదు. రెగ్యులర్ అండ్ రొటీన్ స్టైల్‌లో సినిమా ఉంటుంది. సినిమాలో ఎంట‌ర్‌టైన్‌ చేసే సీన్స్ చాలా తక్కువే. అమ్మాయిల గురించి రమ్యకృష్ణ చెప్పే సీన్స్ కొన్ని కనెక్ట్ అవుతాయి. ఆ తర్వాత సెకండాఫ్‌లో అమ్మాయిలను దెయ్యాలు అంటూ విజయ్ దేవరకొండ చెప్పే సీన్స్ కొన్ని బాగానే ఉన్నాయి. మధ్య మధ్యలో విజయ్ దేవరకొండ తన నటనతో కొన్ని మెరుపులు మెరిపించారు.

‘రింగ్‌లో ఎదుటివ్యక్తి నీ కన్నా బలంగా అనిపించినప్పుడు మీ నాన్నను చంపింది వాడే’ అనుకోమని హీరోకి తల్లి లైగర్ కు సలహా ఇస్తుంది. అప్పుడు హీరో ‘ఐడియా బావుందని’ చూసే ప్రేక్షకులు ఈ సీన్ దగ్గర కనెక్ట్ అవుతారు. విజయ్ దేవరకొండకు ఈ ఒక్క ఐడియాకు కనెక్ట్ అయి ఈ సినిమా చేశారేమో, ఐడియాను ఎమోష‌న‌ల్‌గా చెప్పడంలో పూరి విఫలమయ్యారు. క్లైమాక్స్ ఐతే చూడటానికి మరీ సిల్లీగా ఉంది. అసలు అప్పుడే సినిమా ఐపోయిందా అన్నట్లుగా ఉంటుంది. ఈ సినిమాలో శుభం కూడా అదొక టైపులో ఉంటుంది. హీరో, హీరోయిన్ ప్రేమలో పడటానికి సినిమాలో బలమైన కారణం లేదు. అందుకే ఆ ప్రేమకథ ప్రేక్షకులకు ఆకట్టుకోలేక పోయింది.

మ్యూజిక్ :
సినిమాకు మరో పెద్ద మైనస్ మ్యూజిక్. చూసిన ప్రేక్షకులు దీని కన్నా డియర్ కామ్రేడ్ పాటలు చాలా బావున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో కొత్తగా విన్నవాళ్ళు డబ్బింగ్ పాటలు అనుకున్నా స‌ర్‌ప్రైజ్‌ కావాల్సిన పని లేదు. సాంగ్స్ ప్లేస్‌మెంట్‌ అసలు సెట్ అవ్వలేదు కూడా. ఒక్కోసారి మధ్య మధ్యలో పాటలు ఎందుకు వస్తాయో అర్థం కాదు. సినిమాటోగ్రఫీ ఒక్కటి చూడాటానికి బావుంది.

నటి నటుల నటన :
విజయ్ దేవరకొండ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. కానీ ఆయన పడిన కష్టానికి ఫలితం రాలేదు. నత్తితో ఆ విధంగా డైలాగులు చెప్పడం అంత సులభం ఏమీ కాదు. టోటల్‌గా విజయ్ దేవరకొండ బాడీ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌ అందరిని ఆకట్టుకుంటుంది. హీరో తల్లి పాత్రలో రమ్యకృష్ణ కొన్ని ప‌వ‌ర్‌ఫుల్‌ డైలాగులు చెప్పారు. నటిగా ఇటువంటి రోల్ చేయడం ఆమెకు కష్టం ఏమీ కాదు. హీరోయిన్ అనన్యా పాండే గ్లామర్ షో చేశారు. హీరోయిన్ అనన్య నటన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోదు. అలీ రెండు మూడు సన్నివేశాల్లో కనిపించారు. ఆయనతో పాటు మరో కమెడియన్ ‘గెటప్’ శ్రీను ఉన్నారు. కామెడీ ప్లేస్మెంట్స్ కూడా సెట్ అవ్వలేదు. రోనిత్ రాయ్, విష్, చుంకీ పాండే, ‘టెంపర్’ వంశీ తదితరులు స్క్రీన్ మీద కనిపించారు. కానీ, ఇంపాక్ట్ చూపించడంలో ఫెయిల్ అయ్యారు. క్లైమాక్స్‌లో గ్రేట్ మైక్ టైసన్‌ను చూడటం మంచి కిక్ ఇస్తుంది. సినిమా పూర్తయ్యాక ఆయన ఈ రోల్ ఎందుకు చేశారా  అనిపిస్తుంది.

ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే..
విజయ్ దేవరకొండ అభిమానులకు ఆయన ప్యాక్డ్ బాడీ, కొన్ని సీన్స్ మాత్రమే నచ్చుతాయి. సాధారణ ప్రేక్షకులకు ఐతే సినిమా నచ్చే అవకాశాలు చాలా తక్కువే అని చెప్పుకోవాలి. పూరి జగన్నాథ్ లైగర్ అభిమానులను నిరాశ పరిచారు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘లైగర్’ సినిమాలో పూరి, హీరోకు ఇచ్చే ఇంపార్టెన్స్ అసలు కనబడలేదు.

ఇవి కూడా చదవండి: