Last Updated:

Rajesh khannas Bungalow: రాజేశ్‌ఖన్నా బంగ్లాకు ఏదైనా శాపం ఉందా?

మన దేశంలో సినిమా నటులకు ఉన్న కేజ్రీ అంతా ఇంతా కాదు. వారి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ చూస్తే మతి పోవాల్సిందే. బాలీవుడ్‌ బాద్‌షా షారూక్‌ ఖాన్‌ నివసిస్తున్న ఇళ్లు మన్నత్‌ ముందు అభిమానులు నుంచుని ఫోటోలు తీసుకొని వెళుతుంటారు.

Rajesh khannas Bungalow: రాజేశ్‌ఖన్నా బంగ్లాకు  ఏదైనా   శాపం ఉందా?

Rajesh khannas Bungalow: మన దేశంలో సినిమా నటులకు ఉన్న కేజ్రీ అంతా ఇంతా కాదు. వారి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ చూస్తే మతి పోవాల్సిందే. బాలీవుడ్‌ బాద్‌షా షారూక్‌ ఖాన్‌ నివసిస్తున్న ఇళ్లు మన్నత్‌ ముందు అభిమానులు నుంచుని ఫోటోలు తీసుకొని వెళుతుంటారు. అభిమానులకు అదొక తృప్తి.. అలాగే అమితాబ్‌ బచ్చన్‌ బంగ్లా జల్సా ముందు ఆయన అభిమానులు వచ్చి ఫోటోలు దిగుతుంటారు. అది ఫ్యాన్‌ల ఆనందం. లేదా ముచ్చట అనుకోవచ్చు.

ఇక అసలు విషయానికి వస్తే … ఒకప్పుడు బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రాజేశ్‌ఖన్నా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. మహిళా ఫ్యాన్స్‌ ఆయన కారుకు లిప్‌స్టిక్‌తో ముద్దులు పెట్టి తమ అభిమానం చాటుకునే వారు. అయితే ఖన్నా నివసించిన బంగ్లా ఎవ్వరికి కలిసి రాలేదనే టాక్‌ వినిపిస్తోంది. ఆ బంగ్లాలో అంతకు ముందు ఉన్న నటులు దివాలా తీయడమో అనారోగ్య కారణాల వల్ల కన్నుమూయడం జరిగిందన్నప్రచారం జరుగుతోంది. రాజేశ్‌ ఖన్నా బతికున్న రోజుల్లో ఆయన నివసించిన బంగ్లా ‘ఆశీర్వాద్‌”కు ముంబైలో మంచి పాపులారిటి ఉంది. అయితే ఈ భవనంలో నివసించిన వారిని ఏదో అదృశ్యశక్తి వెంటాడిందని చెబుతారు. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.

మొదటి యజమానే అమ్మేసాడు..(Rajesh khannas Bungalow)

ఈ బంగ్లా మొదటి యజమాని భరత్‌ భూషణ్‌ ఒకప్పడు బాలీవుడ్‌లో అతి పెద్ద సూపర్‌ స్టార్‌. ఆయన సినిమాలు ‘బైజు బావ్‌రా”, మీర్జా గాలిబ్‌ లాంటి చిత్రాల్లో నటించారు. అప్పటి వరకు స్టార్‌డమ్‌తో ఒక వెలుగు వెలిగిన భరత్‌ భూషణ్‌ కొత్త బంగ్లాలోకి మాకం మార్చిన తర్వాత ఆయనను దురదృష్టం వెంటాడింది. ఆయన సినిమా ఒక దాని తర్వాత ఒకటి ఫ్లాప్‌ కావడం మొదలయ్యాయి. సినిమాల్లో భారీ నష్టాల వల్ల ఆయన ఈ బంగ్లాను విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అటు తర్వాత రాజేంద్రకుమార్‌ ఈ బంగ్లాను కేవలం రూ.60,000లకు కొనుగోలు చేశాడు. కాగా రాజేంద్రకుమార్‌ మిత్రుడు మనోజ్‌ కుమార్‌ ఈ బంగ్లా వాస్తు ప్రకారం అన్నీ సవ్యంగా ఉన్నాయని, ఎలాంటి దోషాలు లేవని, పుకార్లు నమ్మవద్దని చెప్పి కన్వెన్స్‌ చేసి బంగ్లా కొనిపించాడు. అయితే బంగ్లాలో చేరే ముందు పూజు చేసుకోవాలని సూచించాడు. రాజేంద్రకుమార్‌ కూడా ఈ బంగ్లాలో చేరిన తర్వాత ఆయన బ్యాడ్‌ టైం మొదలైంది. అతని సినిమాలు కూడా ప్లాప్‌ కావడం మొదలయ్యాయి. భారీ నష్టాలన చవిచూడాల్సి వచ్చింది.

భార్యతో విడిపోయి.. అనారోగ్యం..

ఇక రాజేశ్‌ ఖన్నా వంతు వచ్చింది. రాజేంద్రకుమార్‌ నుంచి రాజేష్‌ ఖన్నా అప్పుడు ఈ బంగ్లాను రూ.3.5 లక్షలకు కొనుగోలు చేశాడు. ఎప్పుడైతే ఆ ఇంట్లో చేరాడో అప్పటి నుంచి ఆయన సినిమాలు ఫ్లాప్‌ కావడం మొదలయ్యాయి. నిర్మాతలు ఆయన స్థానంలో కొత్తవారిని తీసుకోవడం మొదలుపెట్టారు. ఆ ఇంట్లో చేరిన తర్వాత భార్య డింపుల్‌ కాపాడియాతో విడిపోయారు. అటు తర్వాత ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలైంది. 2011లో క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటూ 2012లో ఆయన కన్నుమూశారు. అటు తర్వాత ఓ పారిశ్రామికవేత్త రూ.90 కోట్లకు ఖన్నా బంగ్లాను కొనుగోలు చేశాడు. అతను కూడా ఇబ్బందుల్లో ఉన్నాడన్న వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: